క్రీడాభూమి

దటీజ్ మారడోనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బారాసత్ (పశ్చిమ బెంగాల్), డిసెంబర్ 12: అర్జెంటీనా మాజీ ఫుట్‌బాల్ జెయింట్ డిగో మారడోనా ఆ క్రీడ పట్ల తనకున్న ప్రేమను, అనుబంధాన్ని మారోసారి చాటుకున్నాడు. మూడు రోజుల ప్రైవేటు పర్యటన కోసం వచ్చిన అతను బుధవారం ఇక్కడి ఒక ఫుట్‌బాల్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న బాలబాలికలకు తన డ్రిబ్లింగ్ నైపుణ్యాన్ని రుచి చూపించాడు. కొంత మందిని రెండు గ్రూపులుగా విభజించి, ఒకరి తర్వాత మరొకరిని పిలుస్తూ, వారితో కలిసి ఫుట్‌బాల్ ఆడాడు. వారికి సలహాలు, సూచనలు ఇచ్చాడు. పిల్లలు అడిగిందే తడవుగా ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. వారితో ఫొటోలు దిగాడు. అకాడెమీలో 60 మంది శిక్షణ పొందుతుండగా, అంత మందితో కలిసి ఫొటో తీయించుకునే సమయంలో ఫ్రేమ్‌లోకి సరిపోయే విధంగా అతను ఎలాంటి అభ్యంతరాలు లేకుండా కింద కూర్చున్నాడు. బంతితో కొంత సేపు డ్రిబ్లింగ్ చేయడంతో, 59 ఏళ్ల మారడోనా శరీరం చెమటతో తడిపోయింది. అయినప్పటికీ, నవ్వుతూనే అతను పిల్లలతో సరదాగా గడిపాడు. అనంతరం, సహాయకుడు అనువాదం చేస్తుండగా అతను స్పానిష్ భాషలో మాట్లాడాడు. ఫుట్‌బాల్ కోసమే తాను ఇక్కడికి వచ్చానని, పశ్చిమ బెంగాల్ మంత్రి కూడా ఇక్కడే ఉండడం మంచి పరిణామమని పేర్కొన్నాడు. భారత దేశంలో సమర్థులైన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారని మారడోనా చెప్పాడు. ప్రజలు, ప్రభుత్వం ఏకమైతే, ఫుట్‌బాల్ రంగంలో భారత్ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందని జోస్యం చెప్పాడు. తాను ఇంతకు ముందు కూడా భారత్‌కు వచ్చానని, ప్రతిసారీ తనను ఇక్కడి ప్రజలు ఎంతో ఆదరంగా ఆహ్వానించి, ప్రేమాభిమానాలు పంచారని తెలిపాడు.