క్రీడాభూమి

అఫ్రిదీ కెరీర్‌కు తెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ: వివాదాల్లో చిక్కుకున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షహీద్ అఫ్రిదీ కెరీర్‌కు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్న టి-20 వరల్డ్ కప్ టోర్నీ తర్వాత తాను రిటైర్ అవుతానని అతను పరోక్షంగా ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగే మ్యాచ్ కెరీర్‌లో తనకు చివరిది కావచ్చని ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. అయితే, రిటైర్మెంట్‌పై గతంలో పలుమార్లు ప్రకటనలు చేసి, మళ్లీమళ్లీ మనసు మార్చుకున్న అఫ్రిదీ ఈసారి ఏం చేస్తాడో అన్నది చూడాలి. ఇప్పటికే టెస్టు, వనే్డ ఇంటర్నేషనల్ ఫార్మెట్స్ నుంచి వైదొలగిన అఫ్రిదీ టి-20 వరల్డ్ కప్‌లో పాక్‌కు నాయకత్వం వహించాలన్న కోరికను అప్పట్లోనే వ్యక్తం చేశాడు. బహుశా అందుకే సెలక్టర్లు అతనికి చివరి అవకాశం ఇచ్చి ఉండవచ్చు. కారణాలు ఏవైనా జట్టుకు నాయకత్వం వహిస్తున్న అఫ్రిదీకి వివాదాలు కొత్తకాదు. తాజాగా అతను కొత్త వివాదాల్లో తలదూర్చాడు. పాకిస్తాన్ కంటే భారత్‌లోనే తనకు అభిమానుల నుంచే ఆదరాభిమానాలు ఎక్కువగా లభిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో ఆడుతున్నట్టే ఉంటుందంటూ భారత్‌పై ప్రశంసలు కురిపించాడు. ఫలితంగా స్వదేశంలో మాజీ క్రికెటర్లుసహా పలు వర్గాల వారి ఆగ్రహానికి గురయ్యాడు. అఫ్రిదీ వ్యాఖ్యలు సిగ్గుచేటని, భారత్‌ను పొగడ్తల్లో ముంచెత్తడం దురదృష్టకరమని మాజీ కెప్టెన్ జావేద్ మియందాద్ తదితరులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ వివాదానికి ఇంకా తెరపడక ముందే, భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చిత్తయింది. టోర్నీలో టైటిల్ గెలిచినా గెలవలేకపోయినా, చిరకాల ప్రత్యర్థి భారత్‌ను ఓడిస్తేనే పాక్ అభిమానులు ఆనందిస్తారు. కానీ, అందుకు భిన్నంగా భారత్ చేతిలో పాకిస్తాన్ ఓటమిపాలైంది. మంగళవారం న్యూజిలాండ్‌ను ఢీకొని పరాజయాన్ని చవిచూసింది. దీనితో ఈసారి టి-20 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్స్ చేరే అవకాశాలను ప్రమాదంలోకి నెట్టుకుంది.
భారత్‌ను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేసి, ఆపై వరుస పరాజయాలను ఎదుర్కోవడంతో స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అఫ్రిదీ మరో వివాదంలో చిక్కుకుతున్నాడు. కశ్మీర్ పేరును ప్రస్తావించి పరువు పోగొట్టుకున్నాడు. భారతీయుల ఆగ్రహానికి గురయ్యాడు. కోల్‌కతాలో న్యూజిలాండ్‌తో మ్యాచ్ పూర్తయిన తర్వాత మాట్లాడుతూ, పాక్ మరో మాజీ కెప్టెన్ రమీజ్ రాజా వేసిన ప్రశ్నపై విచిత్రంగా స్పందించాడు. ప్రేక్షకుల నుంచి పాకిస్తాన్ జట్టుకు మద్దతు లభించిందా? అని రమీజ్ ప్రశ్నించగా అవునని అంటూ, ప్రేక్షకుల్లో చాలా మంది కశ్మీర్ నుంచి వచ్చారని వ్యాఖ్యానించాడు. కశ్మీరీలు పాకిస్తాన్‌కు మద్దతునిస్తున్నారన్న అతని పరోక్ష వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరం
అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) స్పష్టం చేసింది. కశ్మీర్ ప్రస్తావనను తీసుకురావాల్సిన అవసరం ఏమిటని నిలదీసింది. కశ్మీర్ నుంచి చాలా మంది ప్రేక్షకులు తరలి వచ్చారనంటూ పాక్ జట్టుకు వారి నుంచే ఎక్కువ మద్దతు లభించిందన్న అభిప్రాయాన్ని కలగచేసే ప్రయత్నం దురదృష్టకరమని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించాడు. రాజకీయాలన క్రీడల్లోకి లాగే ప్రయత్నం చేయవద్దని అఫ్రిదీకి హితవు పలికాడు.