క్రీడాభూమి

కోహ్లీ దంపతులకు ప్రముఖుల శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ఇటలీలోని చారిత్రక ప్రాంతమైన టస్కనీలో, అతి కొద్ది మంది సమక్షంలో ఓ ఇంటివారైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వీరి వివాహం ఎంత గుట్టుచప్పుడు కాకుండా జరిగిందో, పెళ్లి ఫొటోలు అంతగా సంచలనం రేపుతున్నాయి. భారత క్రికెటర్లతోపాటు, పాకిస్తాన్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిదీ తదితరులు కూడా కోహ్లీ దంపతులకు అభినందనలు తెలిపారు.
కుటుంబ సభ్యులు, సన్నిహితులకు విందు
వివాహ సమయంలో సంప్రదాయ దుస్తులతో కనిపించిన కోహ్లీ, అనుష్క శర్మ ఆతర్వాత ఫార్మల్ డ్రెస్‌తో కనిపించారు. అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించిన వీరు, వివాహానంతరం వారికి భారీ విందునిచ్చారు. ట్విటర్‌లో ఫొటోలను పోస్టు చేసిన తర్వాతే ప్రపంచానికి వీరి వివాహం గురించిన సమాచారం అందింది. అప్పటి వరకూ వివాహం ఇటలీలో జరుగుతుందని కొందరు, కాదు స్విట్జర్లాండ్‌లో ఉంటుందని మరికొందరు ఊహాగానాలు చేశారు. పెళ్లి కాదు.. నిశ్చితార్థమే జరుగుతుందని.. అసలు వాళ్లకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయిందని.. సోషల్ మీడియాలో కథనాలు కనిపించాయి. ఈ సస్పెన్స్‌కు తెరదీస్తూ కోహ్లీ, అనుష్క పెళ్లి ఫొటోలను ట్వీట్ చేశారు. అనంతరం సాయంత్రం ఇచ్చిన విందుకు ముందు తీసిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో ఉంచారు. ఇలావుంటే, ఈనెల 21న న్యూఢిల్లీలో, 26న ముంబయిలో రిసెప్షన్ ఇవ్వడానికి వీరు ఏర్పాట్లు పూర్తి చేశారు.

చిత్రం..అమృత్‌సర్‌లో తాను వేసిన కోహ్లీ, అనుష్క పెయంట్‌కు మెరుగులు దిద్దుతున్న చిత్రకారుడు జగ్‌జోత్ సింగ్ రుబాల్