క్రీడాభూమి

రెండో మ్యాచ్‌కీ అదే జట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, డిసెంబర్ 12: భారత్‌తో జరిగిన మొదటి వనే్డలో విజయం సాధించిన జట్టులో ఎలాంటి మార్పు లేకుండానే శ్రీలంక బుధవారం నాటి రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఆటగాళ్లలో ఎవరికీ ఫిట్నెస్ సమస్య లేదని, పైగా మొదటి మ్యాచ్‌లో ప్రతి ఒక్కరూ గొప్పగా రాణించారనీ లంక కెప్టెన్ తిసర పెరెరా అన్నాడు. జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదంటూ, అదే ప్లేయింగ్ ఎలెవెన్‌తో మ్యాచ్ ఆడే విషయాన్ని పరోక్షంగా తెలిపాడు. ధర్మశాలలో ఆడినట్టుగానే మొహాలీలో కూడా ఆడగలిగితే, ఖాయంగా సిరీస్‌ను కైవసం చేసుకుంటామని మంగళవారం నెట్ ప్రాక్టీస్ అనంతరం విలేఖరులలో మాట్లాడుతూ పెరెరా ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌ను ఏడు వికెట్లతో ఓడించడానికి ఎంత కష్టపడ్డామో, రెండో వనే్డలోనూ గెలిచి, సిరీస్‌ను అందుకోవడానికి అంతకు రెట్టింపు కష్టపడతామని అన్నాడు. ఒక ప్రశ్నకు బదులిస్తూ, ఒత్తిడి అనే మాటకు అర్థం లేదని స్పష్టం చేశాడు. ఏ సిరీస్‌లోనైనా ప్రతి మ్యాచ్‌కీ ప్రత్యేకత ఉంటుందని, ఎప్పటికప్పుడు కొత్త తరహా వ్యూహాలతో, సర్వశక్తులు కేంద్రీకరించి పోరాడేందుకు సిద్ధం కావాలని అన్నాడు. మొహాలీ పిచ్ గురించి మాట్లాడుతూ, ఇది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండవచ్చని అన్నాడు. వాతావరణం, పిచ్ తీరుపై మ్యాచ్ ఆధారపడి ఉంటుందన్నాడు. మొహాలీ తనకు ఎంతో సుపరచితమైనదని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించిన అనుభవం ఉన్న పెరెరా అన్నాడు.