క్రీడాభూమి

టీనేజర్ సుందర్ అరంగేట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, డిసెంబర్ 13: తమిళనాడుకు చెందిన టీనేజ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ బుధవారం వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అరంగేట్రం చేశాడు. అతనికి వనే్డ క్యాప్‌ను కోచ్ రవి శాస్ర్తీ అందచేశాడు. 1999 అక్టోబర్ 5న జన్మించిన సుందర్ ఇప్పటి వరకూ 12 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 9 లిస్ట్ ‘ఏ’ (50 ఓవర్ల) మ్యాచ్‌లు ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ తరఫున అద్భుత ప్రతిభ కనబరచి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. నిజానికి తొలుత అతనికి శ్రీలంకతో జరిగే టి-20 సురీస్‌లో ఆడే భారత జట్టులో చోటు దక్కింది. అయితే, కేదార్ జాధవ్ గాయం కారణంగా దూరంకావడంతో, అదృష్టవశాత్తు అతను వనే్డ జట్టులోకి వచ్చాడు. ధర్మశాలలో జరిగిన మొదటి వనే్డలో అతను ప్లేయింగ్ ఎలెవెన్‌లో లేడు. అయితే, స్టాండ్ ఇన్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో వనే్డలో అతనికి అవకాశమిచ్చాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్ల కోటాను పూర్తి చేసిన సుందర్ 65 పరుగులిచ్చి, లాహిరు తిరిమానే వికెట్ పడగొట్టాడు. కాగా, చిన్న వయసులోనే వనే్డలు ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో సుందర్‌కు ఏడో స్థానం దక్కింది. ఈ జాబితాలో సచిన్ తెండూల్కర్ నంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు.

తక్కువ వయసులోనే వనే్డ ఇంటర్నేషనల్స్‌లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్లలో ‘టాప్-10’ వీరే..

1. సచిన్ తెండూల్కర్ (16 సంవత్సరాల, 238 రోజులు),
2. మనీందర్ సింగ్ (17 సంవత్సరాల, 222 రోజులు),
3. హర్భజన్ సింగ్ (17 సంవత్సరాల, 288 రోజులు),
4. హార్దిక్ పాండ్య (17 సంవత్సరాల, 301 రోజులు),
5. లక్ష్మీ రతన్ శుక్లా (17 సంవత్సరాల, 320 రోజులు),
6. చేతన్ శర్మ (17 సంవత్సరాల, 338 రోజులు),
7. వాషింగ్టన్ సుందర్ (18 సంవత్సరాల, 69 రోజులు),
8. పీయూష్ చావ్లా (18 సంవత్సరాల, 139 రోజులు),
9. సురేష్ రైనా (18 సంవత్సరాల, 245 రోజులు),
10. యువరాజ్ సింగ్ (18 సంవత్సరాల, 296 రోజులు).