క్రీడాభూమి

చివరి వనే్డలోనూ రహానేకు నిరాశే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, డిసెంబర్ 13: శ్రీలంకతో ఈనెల 17న విశాఖపట్నంలో జరిగే చివరి, మూడో వనే్డలోనూ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానేకు చోటు దక్కకపోవచ్చని తెలుస్తున్నది. శ్రీలంకనే జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రహానే దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. అయితే, అతనిపై నమ్మకం ఉంచిన సెలక్టర్లు వనే్డ సిరీస్‌కు ఎంపిక చేశారు. కానీ, జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం ధర్మశాలలో జరిగిన మొదటి వనే్డతోపాటు, బుధవారం నాటి మొహాలీ వనే్డలోనూ అతనిని ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తీసుకోలేదు. రహానే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కాబట్టి, అతని బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చే ఉద్దేశం లేదని జట్టు స్టాండ్ ఇన్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేయడంతో, అతనికి చివరి వనే్డలోనూ చోటు దక్కదేమోనన్న అనుమానం తలెత్తుతున్నది. టి-20 ఫార్మాట్‌కు ఎంపిక కాలేదు కాబట్టి, దక్షిణాఫ్రికా టూర్‌కు అతను సరైన ఫామ్‌గానీ, ఆత్మవిశ్వాసం లేకుండా సిద్ధం కావాల్సి ఉంటుంది.