క్రీడాభూమి

ఇంగ్లాండ్ ఆశలు సజీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: టి-20 వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో సెమీస్ చేరే అవకాశాలను ఇంగ్లాండ్ సజీవంగా నిలబెట్టుకుంది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ని ఈ జట్టు 15 పరుగుల తేడాతో గెల్చుకొని, రేస్‌లో కొనసాగుతున్నది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన అఫ్గాన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేయగలిగింది. అజేయంగా 41 పరుగులు సాధించడమేగాక, ఒక వికెట్ కూడా కూల్చిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
టాప్ ఆర్డర్ విఫలం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసింది. జేమ్స్ విన్స్ (22), జో రూట్ (12) తప్ప టాప్ ఆర్డర్ విఫలమైంది. నలుగురు బ్యాట్స్‌మెన్, జాసన్ రాయ్ (5), ఇయాన్ మోర్గాన్ (0), బెన్ స్టోక్స్ (7), జొస్ బట్లర్ (6) కనీసం రెండంకెల స్కోరు కూడా చేయకుండానే వెనుదిరిగారు. అయితే, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో మోయిన్ అలీ 41 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. అతను 33 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. క్రిస్ జోర్డార్ 15 పరుగులు చేయగా, డేవిడ్ విల్లే 20 పరుగులతో మోయిన్ అలీతో కలిసి నాటౌట్‌గా నిలిచాడు. అఫ్గాన్ బౌలర్లలో మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ చెరి రెండు వికెట్లు కూల్చారు.
అనుభవ రాహిత్యం!
అనుభవ రాహిత్యమే ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ పరాజయానికి కారణమైంది. ఆ జట్టు ఆటగాళ్లు ఎంతగా పోరాడినప్పటికి, అంతర్జాతీయ స్థాయి వేదికలపై ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేకపోవడంతో, 15 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. నూర్ అలీ జద్రాన్ (17), రషీద్ ఖాన్ (15), మహమ్మద్ నబీ (12), సమీయుల్లా షెర్వానీ (22), నజీబుల్లా జద్రాన్ (14) కొంత సేపు ఇంగ్లాండ్ బౌలింగ్‌కు ఎదురునిలిచే ప్రయత్నం చేశారు. సఫీయుల్లా వీరోచిత ఇన్నింగ్స్ ఆడి, 20 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 (విన్స్ 22, మోయిన్ అలీ 41 నాటౌట్, జోర్డాన్ 15, విల్లే 20 నాటౌట్, మహమ్మద్ నబీ 2/17, రషీద్ ఖాన్ 2/17).
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 (నూర్ అలీ జద్రాన్ 17, రషీద్ ఖాన్ 15, మహమ్మద్ నబీ 12, సమీయుల్లా షెర్వానీ 22, నజీబుల్లా జద్రాన్ 13, షఫియుల్లా 35 నాటౌట్, విల్లే 2/23, అదిల్ రషీద్ 2/18).

ఇంగ్లాండ్ టాప్ స్కోరర్ మోయన్ అలీ (41 నాటౌట్).
ఒక వికెట్ కూడా సాధించిన అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది