క్రీడాభూమి

ఆ ముగ్గురినీ శిక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, డిసెంబర్ 14: ప్రపంచ కప్ నిర్వాహణ హక్కులు ఇవ్వడానికి ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధికారులు భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై నమోదైన కేసు విచారణ వేగవంతమైంది. లంచాలు తీసుకున్నట్టు రుజువైన ముగ్గురిని కఠినంగా శిక్షించాలని కోర్టును ప్రాసిక్యూషన్ కోరింది. పెరూ సాకర్ మాజీ చీఫ్ మాన్యుయెల్ బర్గా, బ్రెజిల్ ఫుట్‌బాల్ కానె్ఫడరేషన్ మాజీ అధ్యక్షుడు జోస్ మరియా మారిన్‌తోపాటు ఫిఫా మాజీ ఉపాధ్యక్షుడు జువాన్ ఏంజెల్ నపౌట్ కూడా అక్రమాలకు పాల్పడినట్టు రుజువుచేసే సాక్ష్యాధారాలను కోర్టుకు ప్రాసిక్యూషన్ న్యాయవాదులు సమర్పించారు. ఈ ప్రతివాదులు ముగ్గురూ పరస్పర భిన్నమైన ప్రకటనలు, పొంతన లేని మాటలతో కోర్టును తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వారి నేరం దాదాపుగా రుజువైందని, కాబట్టి, కఠినంగా శిక్షించాలని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వీరు 21.45 మిలియన్ డాలర్ల ముడుపులు తీసుకున్నట్టు ఖాతాల వివరాలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ఇలాంటి నేరస్థులను కఠినంగా శిక్షించకపోతే, భవిష్యత్తులో అక్రమాలు మరింతగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

చిత్రం..కోర్టు హాల్ నుంఛి బయటకు వస్తున్న
ఫిఫా మాజీ ఉపాధ్యక్షుడు జువాన్ ఏంజెల్ నపౌట్