క్రీడాభూమి

ఉత్తర కొరియాలో ఐఓసీ అధ్యక్షుడి పర్యటన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాసనే్న, డిసెంబర్ 14: అణు పరీక్షలు పరీక్షలు, క్షిపణులు ప్రయోగాలతో ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న ఉత్తర కొరియాలో పర్యటించాలని అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. స్థానిక పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం, ఉత్తర కొరియాలో పర్యటించి, వచ్చే ఏడాది దక్షిణ కొరియాలోని పయాంగ్‌చాంగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఆ దేశాన్ని ఒప్పించాలన్నది బాచ్ ప్రయత్నం. ప్రపంచ శాంతి నినాదంతో ఈ పోటీలను దక్షిణ కొరియా నిర్వహిస్తున్నది. ఉత్తర కొరియా ఒకవేళ పోటీల్లో పాల్గొంటే, తమ ప్రయత్నాలకు సాఫల్యం చేకూరుతుందని దక్షిణ కొరియా అధికారుల ఆశ. నిజానికి రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. చిరకాల శత్రువులైన ఈ రెండు దేశాలు ఒకే వేదికను పంచుకోవడం చాలా అరుదు. అయితే, రాకీయాలతో క్రీడలకు సంబంధం లేదని ఇటీవల తరచు వినిపిస్తున్న వాదన. ఆ కోణంలో ఆలోచిస్తే, ఉత్తర కొరియా అథ్లెట్లను దక్షిణ కొరియా సాదరంగా ఆహ్వానించాల్సి ఉంటుంది. అదే విధంగా దక్షిణ కొరియాలో జరిగే ఈవెంట్‌లో ఉత్తర కొరియా తప్పక పాల్గొనాలి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఉత్తర కొరియాను ఒప్పించేందుకు బాచ్ తన వంతు ప్రయత్నం చేయనున్నాడు. అయితే, అతనికి ఎలాంటి అనుభవం ఎదురవుతుందనేదే ప్రశ్న.