క్రీడాభూమి

సింధు ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, డిసెంబర్ 14: దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్ బా డ్మింటన్ టోర్నమెంట్ మొదటి రౌండ్‌లో తెలుగు తేజం పివి సింధు ముందంజ వేయగా, ‘ఆంధ్రావాలా’ కిడాంబి శ్రీకాంత్ పరా జయాన్ని ఎదుర్కొని, ఈ టోర్నమెంట్‌లో తదుపరి రౌండ్‌ను చే రే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాడు. గురువారం నాటి మ్యా చ్‌లో జపాన్ క్రీడాకారిణి సయాకా సాటోతో తలపడిన సింధు 21-13, 21-13 తేడాతో సులభంగానే గెలిచింది. రౌండ్ రాబిన్ విధానంలో జరిగే ఈ ఈవెంట్ టైటిల్ పేవరిట్స్ జాబితాలో ఉన్న సింధు తన స్థాయకి తగిన ఆటతో రాణించింది. సయాకాకు కోలుకునే అవకాశం ఇవ్వకుండా, వరుస సెట్లలో విజయభేరి మోగించింది. అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్న సింధుపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మొదటి మ్యాచ్‌లో ఆమె హీ బింగ్‌జియావోను 21-11, 16-21, 21-18 తేడాతో ఓడించింది. కాగా, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ పోరాటానికి దాదాపుగా తెరపడింది. గురువారం నాటి మ్యాచ్‌లో చైనీస్ తైపీకి చెందిన చౌ తియెన్ చెన్‌తో తలపడిన శ్రీకాంత్ 21-18, 21-18 తేడాతో ఓటమిపాలయ్యాడు. అంతకు ముందు అతను మొదటి మ్యాచ్‌ని ప్రపంచ నంబర్ వన్ విక్టర్ అక్సెల్‌సెన్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. రౌండ్ రాబిన్ విధానంలో షికీతో అతను చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయతే, ఇప్పటికే రెండు మ్యాచ్‌లను చేజార్చుకున్న శ్రీకాంత్ చివరి మ్యాచ్‌లో గెలిచినా తదుపరి రౌండ్‌కు చేరే అవకాశం ఏమాత్రం లేదు.