క్రీడాభూమి

ఆస్ట్రేలియా చేతిలో శ్రీలంక చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: మహిళల టి-20 వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో గురువారం జరిగిన మొదటి గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంకను ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్, ఎలిస్ విలానీ అర్ధ శతకాలతో కదంతొక్కి, ఆస్ట్రేలియాకు తిరుగులేని విజయాన్ని అందించారు. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి జయంగనీ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ యశోద మేండిస్ (0) వికెట్‌ను చేజార్చుకున్నప్పటికీ, రెండో వికెట్‌కు చమరి జయంగనీ, దిల్లని సురంగిక 75 పరుగులు జోడించడంతో కోలుకుంది. సురంగిక 35 బంతుల్లో 38 పరుగులు చేసి అవుట్‌కాగా, జయంగనీ కూడా 38 పరుగులు చేసింది. అయితే, మిగతా బ్యాట్స్‌విమెన్ క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోవడంతో శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులకు పరిమితమైంది.
విజయానికి అవసరమైన 124 పరుగులను ఆస్ట్రేలియా కేవలం ఒక వికెట్ కోల్పోయి సాధించింది. అలిసా హీలీ 12 పరుగులు చేసి రణవీర బౌలింగ్‌లో బౌల్డ్‌కాగా, విలానీ, లానింగ్ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ 17.4 ఓవర్లలోనే జట్టును లక్ష్యానికి చేర్చారు. మరో 14 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసే సమయానికి విలానీ 53 (39 బంతులు, 9 ఫోర్లు), లానింగ్ 56 (53 బంతులు, 8 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచారు.
ఇలావుండగా, మహిళల విభాగంలో శుక్రవారం విశ్రాంతి దినం. శనివారం మ్యాచ్‌లు తిరిగి ఆరంభమవుతాయ.