క్రీడాభూమి

మొదటి టెస్టుకు స్టెయిన్ దూరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్ టౌన్, జనవరి 3: ఫిట్నెస్ సమస్య కారణంగా చాలాకాలం విశ్రాంతి తీసుకున్న దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ భారత్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మొదటి టెస్టులో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ప్రాక్టీస్ సెషన్‌లో భుజం కండరాలు బెణకడంతో స్టెయిన్ బాధపడుతున్నాడని సమాచారం. పరిస్థితి మరింత విషయమించకుండా ఉండాలంటే, అతనికి మొదటి టెస్టు నుంచి విశ్రాంతినివ్లాని క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) భావిస్తున్నట్టు స్థానిక మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. అయితే, అధికారికంగా ఈ విషయంపై సరైన సమాచారం లేదు.