క్రీడాభూమి

ధావన్ ఫిట్.. జడేజాకు జ్వరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్ టౌన్, జనవరి 3: భారత ఓపెనర్ శిఖర్ ధావన్ కాలి మడమ నొప్పి నుంచి కోలుకున్నాడు. శుక్రవారం నుంచి దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగే మొదటి టెస్టు మ్యాచ్‌కి అతను అందుబాటులో ఉంటాడు. అయితే, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జ్వరంతో బాధపడుతున్న కారణంగా, అతని పేరును పరిశీలించే అవకాశాలు లేవు. ధావన్ పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నాడని, మురళీ విజయ్‌తో కలిసి అతను ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. జడేజా అనారోగ్యంతో బాధపడుతున్నాడని పేర్కొంది. అక్కడే ఉన్న నిపుణుల బృందం అతనికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నదని తెలిపింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి, అసరమైన సూచనలు చేస్తున్నట్టు తెలిపింది.