క్రీడాభూమి

బెంగళూరులో నేటి నుంచి హాకీ శిబిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 3: భారత హాకీ శిక్షణా శిబిరం గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనే 33 మంది పేర్లను హాకీ ఇండియా (హెచ్‌ఐ) బుధవారం ప్రకటించింది. మోకాలి నొప్పి కారణంగా సుమారు ఎనిమిది నెలలు విశ్రాంతి తీసుకున్న గోల్‌కీపర్ శ్రీజేష్ ఈ క్యాంప్‌లో తన ఫిట్నెస్‌ను పరీక్షించుకోనున్నాడు. పది రోజులు జరిగే ఈ శిబిరంలో 2016 జూనియర్ వరల్డ్ కప్‌లో ఆడిన గోల్‌కీపర్ క్రిషన్ పాథక్, శ్రీజేష్ స్థానంలో సీనియర్స్ జట్టుకు సేవలు గందించిన అనిల్ చిక్టే, సూరజ్ కర్కేరా కూడా శిక్షణా శిబిరానికి హాజరవుతారు. అదే విధంగా యువ డిఫెండర్ నీలమ్ సంజీప్, సీనియర్ ఆటగాడు సర్దార్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిడాస్, దిప్సాన్ టిర్కీ, వరుణ్ కుమార్, రూపీందర్ పాల్ సింగ్, బీరేంద్ర లాక్రా, గురీందర్ సింగ్ తదితరులు కూడా శిబిరంలో పాల్గొనే వారిలో ఉన్నారు.