క్రీడాభూమి

‘టాప్’ పథకం కింద రూ. 3.14 కోట్లు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం కింద ఎంపిక చేసిన 175 మంది అథ్లెట్ల ఖర్చుల కోసం 3.14 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తెలిపాడు. జాతీయ క్రీడాభివృద్ధి నిధి (ఎన్‌ఎస్‌డీఎఫ్) ద్వారా ఈ మొత్తాన్ని పంచనున్నట్టు అతను బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మాసం వరకూ ఖర్చుల కింద ఈ మొత్తాన్ని ఇచ్చామని వివరించాడు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి, ‘టాప్’ పథకం కింద ఎంపిక చేసిన అథ్లెట్లందరికీ ఖర్చుల కింద నెలకు 50,000 రూపాయలు చొప్పున ఇస్తున్నట్టు రాథోడ్ తెలిపాడు. క్రీడలకు కేంద్రం ఇతోథిక సహాయసహకారాలు అందిస్తున్నదని అన్నాడు.