క్రీడాభూమి

క్రిస్ వోక్స్‌కు ఫిట్నెస్ సమస్య చివరి టెస్టులో ఆడడని ప్రకటించిన రూట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 3: ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ గురువారం నుంచి ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఆడడం లేదని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ తెలిపాడు. బుధవారం నెట్ ప్రాక్టీస్ ముగిసిన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడుతూ వోక్స్ పక్కటెముకల వద్ద కండరాలు పట్టుకున్నాయని, దీనితో అతను ఇబ్బంది పడుతున్నాడని అన్నాడు. వోక్స్ జట్టులోని లేని కారణంగా, 20 ఏళ్ల యువ లెగ్ స్పిన్నర్ మాసన్ క్రేన్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉంటాడని చెప్పాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి మూడు టెస్టులను కోల్పోయిన ఇంగ్లాండ్ 0-3 తేడాతో సిరీస్‌ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. వర్షం కారణంగా పలుమార్లు ఆటకు అంతరాయం ఏర్పడిన నాలుగో టెస్టు చివరికి డ్రాగా ముగిసింది. చివరిదైన ఐదో టెస్టులో విజయం సాధించడం ద్వారా కొంతైనా పరువును నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న ఇంగ్లాండ్‌కు వోక్స్ అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగించే విషయమే. అయితే, క్రేన్ సమర్థుడని, టెస్టు కెరీర్‌ను ప్రారంభించనున్న అతను తన ప్రయత్నంలో సఫలమవుతాడన్న నమ్మకం తనకు ఉందని రూట్ అన్నాడు. చివరి టెస్టులో ఆస్ట్రేలియాకు గట్టిపోటీనిస్తామని, విజయం కోసం శ్రమిస్తామని చెప్పాడు.