క్రీడాభూమి

మహిళల టి-20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, మార్చి 26: బ్యాటింగ్ విభాగం కీలకమైన పాత్ర పోషిస్తుందని, వెస్టిండీస్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో తమ బ్యాట్స్‌వి మెన్ రాణిస్తారన్న నమ్మకం తనకు ఉందని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నది. మహిళల టి-20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరాలంటే, విండీస్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాలి. ఆ మ్యా చ్‌ని చేజార్చుకుంటే టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమిస్తుంది. ఈ నేపథ్యంలో కీలక మ్యా చ్‌కి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని శని వారం విలేఖరులతో మాట్లాడుతూ మిథాలీ రాజ్ పేర్కొంది. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగా ల్లో మెరుగ్గా ఉన్నామని, బ్యాటింగ్‌లోనే కొం త బలపడాల్సిన అవసరం ఉందని మిథాలీ చెప్పింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంకా బాగా ఆడగలిగి ఉన్నప్పటికీ, అను కున్న స్థాయలో రాణించలేకపోయామని ఆ వేదన వ్యక్తం చేసింది. అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని తెలిపింది. వరల్డ్ కప్ వంటి మేజర్ ఈవెం ట్స్‌లో ప్రతి మ్యాచ్ అత్యంత కీలకమైనదన్న విషయం తమకు తెలుసునని ఒక ప్రశ్నకు స మాధానంగా చెప్పింది. సీనియర్ క్రీడాకారి ణులపై ఒత్తిడి తీవ్రంగా ఉంటుందా అన్న ప్ర శ్నపై స్పందిస్తూ, క్రికెట్ అనేది సమష్టిగా ఆడే ఆట అని వ్యాఖ్యానించింది. ఒకరిద్దరు వ్య క్తుల వల్ల జట్టు గెలవడంగానీ, ఓడిపోవడం గానీ జరగదని స్పష్టం చేసింది. మ్యాచ్ ఆడే సమయంలో అందరిపైనా ఒత్తిడి ఉంటుంద ని, అందులో సీనియర్లు, జూనియర్లు అన్న తేడా ఉండదని మిథాలీ అన్నది.
వెస్టిండీస్ కెప్టెన్ స్ట్ఫానీ టేలర్ మాట్లాడు తూ ఆదివారం నాటి మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డి పోరాడతామని చెప్పింది. విజయమే త మ లక్ష్యమని పేర్కొంది.

చిత్రం భారత కెప్టెన్ మిథాలీ రాజ్