క్రీడాభూమి

మూడో టీ-20 సెంచరీతో మున్రో రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్ మాంగనుయ్ (న్యూజిలాండ్), జనవరి 3: కొలిన్ మున్రో రికార్డు శతకం బుధవారం ఇక్కడ జరిగిన చివరి టీ-20 ఇంటర్నేషనల్‌లో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్‌కు 119 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ 2-0 తేడాతో కైవసం చేసుకోగా, వైఫల్యాల బాటలో నడిచిన విండీస్ ఈ టూర్‌ను ఒక్క విజయం కూడా లేకుండా ముగించింది. టీ-20 ఇంటర్నేషనల్స్‌లో మూడు శతకాలు సాధించిన తొలి క్రికెటర్ రికార్డు పుటల్లోకి ఎక్కిన మున్రో 53 బంతుల్లో 104 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (63) అర్ధ శతకంతో రాణించడంతో, నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 5 వికెట్లకు 243 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించగలిగింది. మొదటి వికెట్‌కు గుప్టిల్, మున్రో 11.5 ఓవర్లలో 136 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడం విశేషం. వెస్టిండీస్ బౌలర్లలో కార్లొస్ బ్రాత్‌వెయిట్‌కు రెండు వికెట్లు లభించాయి. జెరోమ్ టేలర్, రయాద్ ఎమ్రిట్ చెరో వికెట్ పడగొట్టారు.
తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు
ఈ టూర్‌లో చివరి మ్యాచ్‌ని గెల్చుకొని, పరువు నిలబెట్టుకోవాలన్న ఆశతో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్‌ను టిమ్ సౌథీ మొదట్లోనే దెబ్బతీశాడు. అతను వేసిన మొదటి బంతిలో కొలిన్ మున్రోకు క్యాచ్ ఇచ్చి చాడ్విక్ వాల్టన్ (0) వెనుదిరిగాడు. అదే ఓవర్ ఐదో బంతికి స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ కూడా పెవిలియన్ చేరాడు. రెండు బంతులు ఎదుర్కొన్న అతను పరుగుల ఖాతా తెరవకుండానే గ్లేన్ ఫిలిప్స్‌కు చిక్కాడు. స్కోరుబోర్డుపై కేవలం ఒక పరుగు మాత్రమే ఉండగా, రెండు వికెట్లు కోల్పోయిన విండీస్‌ను ఆదుకోవడానికి ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఆండ్రె ఫ్లెచర్ తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ, మిగతా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో వెస్టిండీస్ పరుగుల వేటలో విఫలమైంది. ఫ్లెచర్ 32 బంతుల్లో 46 పరుగులు సాధించగా, రోవ్‌మన్ పావెల్ (16), కెప్టెన్ కార్లొస్ బ్రాత్‌వెయిట్ (15), ఆష్లే నర్స్ (15) జట్టును ఆదుకోలేకపోయారు. ఫలితంగా విండీస్ 16.3 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులు చేయగలిగింది. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయపడిన కారణంగా షాయ్ హోప్ బ్యాటింగ్‌కు దిగలేదు.
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టెస్టులతో మొదలైన వెస్టిండీస్ పరాజయాల పరంపర చివరి వరకూ కొనసాగింది. మొదటి టెస్టను ఇన్నింగ్స్ 67 పరుగుల తేడాతో కోల్పోయిన విండీస్ రెండో టెస్టులో 240 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. ఫలితంగా టెస్టు సిరీస్‌లో 0-2 తేడాతో వైట్‌వాష్ వేయించుకుంది. మొదటి వనే్డలో ఐదు వికెట్లు, రెండో వనే్డలో 204 భారీ తేడాతో ఓటమిపాలైంది. డక్‌వర్త్ లూయిస్ విధానంలో ఫలితాన్ని తేల్చాసివచ్చిన చివరి, మూడో వనే్డను 66 పరుగుల తేడాతో కోల్పోయింది. దీనితో వనే్డ ఇంటర్నేషనల్స్ సిరీస్‌లోనూ విండీస్‌కు క్లీన్‌స్వీప్ (0-3) తప్పలేదు. కాగా, టీ-20 ఇంటర్నేషనల్స్‌లో మొదటి మ్యాచ్‌ని 47 పరుగుల తేడాతో చేజార్చుకున్న విండీస్‌ను రెండో మ్యాచ్‌ని వర్షం ఆదుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 9 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. ఈ దశలో భారీ వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. చివరికి మ్యాచ్‌ని రద్దు చేసినట్టు అంపైర్లు ప్రకటించారు. ఇక చివరిదైన మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 119 పరుగుల భారీ ఆధిక్యంతో గెలవగా, విండీస్ ఈ సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 (మార్టిన్ గుప్టిల్ 63, కొలిన్ మున్రో 104, టామ్ బ్రూస్ 23, కేన్ విలియమ్‌సన్ 19, కార్లొస్ బ్రాత్‌వెయిట్ 2/50, జెరోమ్ టేలర్ 1/53, రయాద్ ఎమ్రిట్ 1/42).
వెస్టిండీస్ ఇన్నింగ్స్: 16.3 ఓవర్లలో 9 వికెట్లకు 124 (ఆండ్రె ఫ్లెచర్ 46, రోవ్‌మన్ పావెల్ 16, కార్లొస్ బ్రాత్‌వెయిట్ 15, ఆష్లే నర్స్ 14, జెరోమ్ టేలర్ 13, షాయ్ హోప్ గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేదు, టిమ్ సౌథీ 3/21, ట్రెంట్ బౌల్ట్ 2/29, ఇష్ సోధీ 2/25).

ఈ మ్యాచ్‌లో 104 పరుగులు చేసి, టీ-20 ఇంటర్నేషనల్స్‌లో మూడు శతకాలు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన కొలిన్ మున్రో. గత ఏడాది జనవరి 6న బంగ్లాదేశ్‌పై 101, నవంబర్ 4న భారత్‌పై 109 (నాటౌట్) చొప్పున అతను రెండు సెంచరీలు నమోదు చేశాడు. తాజాగా వెస్టిండీస్‌పై సెంచరీ సాధించి, మూడో శతకంతో రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు