క్రీడాభూమి

మియామీ ఓపెన్ టెన్నిస్ ప్రీ క్వార్టర్స్‌కు జొకొవిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మియామీ, మార్చి 28: ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకొవిచ్ ఇక్కడ జరుగుతున్న మియామీ ఓపెన్ టెన్నిస్‌లో ప్రీ క్వార్టర్స్ చేరాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో అతను 33వ ర్యాంక్ ఆటగాడు జవో సౌసాను 6-4, 6-1 తేడాతో చిత్తుచేశాడు. జొకొవిచ్ విజృంభణకు సౌసా నుంచి ఏ దశలోనూ ప్రతిఘటన ఎదురుకాలేదు. మరో మ్యాచ్‌లో యొషిహితో నిషియోకాను 6-1, 6-2 స్కోరుతో ఓడించిన డొమినిక్ థియెమ్ క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానం కోసం జొకొవిచ్‌తో తలపడతాడు. ఏడో ర్యాంక్ ఆటగాడు థామస్ బెర్డిచ్ 6-3, 6-7, 6-3 ఆధిక్యంతో 31వ ర్యాంకర్ స్టీవ్ జాన్సన్‌పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో బెనోట్ పైర్‌ను 6-3, 6-0 స్కోరుతో వరుస సెట్లలో ఓడించిన రిచర్డ్ గాస్క్వెట్ ప్రీ క్వార్టర్స్‌లో బెర్డిచ్‌ను ఢీ కొంటాడు. 18 ర్యాంకర్ గిలెస్ సిమోన్ 6-3, 6-7, 6-3 తేడాతో తన కంటే ఏడు స్థానాలు మెరుగ్గా ఉన్న మారిన్ సిలిక్‌పై సంచలన విజయాన్ని నమోదు చేశాడు. అతను తర్వాతి మ్యాచ్‌లోలుకాస్ పౌలీని ఢీ కొంటాడు. మూడో రౌండ్‌లో పౌలీ 6-7, 7-6, 7-5 స్కోరుతో ఎనిమిదో సీడ్ డేవిడ్ ఫెరర్‌పై అనూహ్యంగా గెలుపొందాడు. డేవిడ్ గోఫిన్ 6-1, 6-1 తేడాతో విక్టర్ ట్రోయికీని చిత్తుచేయగా, ఫెర్నాండో వెర్డాస్కోను హొరాసియో జెబలాస్ 1-6, 6-4, 7-6 స్కోరుతో ఓడించాడు.
కెర్బర్ ముందంజ
రెండో సీడ్ ఏంజెలిక్ కెర్బర్ మియామీ ఓపెన్ టెన్నిస్ నాలుగో రౌండ్‌లో అడుగుపెట్టింది. మూడో రౌండ్‌లో కికి బెర్టెన్స్‌తో తలపడిన ఆమె మొదటి సెట్‌ను 1-6 తేడాతో చేజార్చుకుంది. అయితే, రెండో సెట్‌ను 6-2 స్కోరుతో గెల్చుకుంది. కీలకమైన మూడో సెట్‌లో 3-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ దశలో ఫిట్నెస్ సమస్యతో బెర్టెన్స్ వైదొలగడంతో కెర్బర్ ప్రీ క్వార్టర్స్ చేరింది. ఆమె క్వార్టర్ ఫైనల్స్‌కు చేరేందుకు టిమియా బబోస్‌ను ఢీ కొంటుంది. టిమియా 7-5, 6-0 తేడాతో నవోమీ ఒసాకాపై గెలుపొందింది. మరో ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో విక్టోరియా అజరెన్కా, గార్బిన్ ముగురుజా తలపడతారు. 13వ సీడ్ అజరెన్కా మూడో రౌండ్‌లో మగ్దా లినెట్‌ను 6-3, 6-0 తేడాతో ఓడించగా, నాలుగో సీడ్ ముగురుజా 6-1, 6-0 ఆధిక్యంతో నికోల్ గిబ్స్‌పై విజయం సాధించింది. ఇరినా కెమిల్లా బెగూ 7-5, 1-6, 6-4 తేడాతో క్రిస్టినా ప్లిస్కోవాపై గెలవగా, తొమ్మిదో సీడ్ రాబర్టా విన్సీపై 22వ ర్యాంక్ క్రీడాకారిణి మాడిసన్ కీస్6-4, 6-4 స్కోరుతో సంచలన విజయం సాధించి, ప్రీ క్వార్టర్స్‌లో కెమిల్లా బెగూతో పోరును ఖాయం చేసుకుంది. జొహన్నా కొన్టా 4-6, 6-1, 7-6 తేడాతో అతి కష్టం మీద ఎలెనా వెస్నినాను ఓడించగా, మోనికా నికలెస్క్యూ 6-4, 6-1 ఆధిక్యంతో కొకో వాండ్‌వెగేపై గెలిచింది. ప్రీ క్వార్టర్స్‌లో కొన్టా, నికలెస్క్యూ పోరాడతారు.