క్రీడాభూమి

టైటిళ్లపై స్టార్ల కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ టైటిళ్ల పై భారత స్టార్లు కనే్నశారు. మంగళవారం నుంచి క్వాలిఫయర్స్‌తో ప్రారం భం కానున్న ఈ టోర్నీ పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్, మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ ఫేవరిట్స్‌గా బరిలోకి దిగనున్నారు. కాలి మడమ గాయం కారణంగా ఇటీవల కాలంలో కొన్ని టోర్నీల నుంచి వైదొలగిన సైనా పూర్తి ఫిట్నెస్‌తో ఉందా లేదా అన్నది ఇంకా తెలియడం లేదు. తెలుగు తేజం పివి సింధు కూడా టైటిల్ వేటలో ఉంది. కాగా, పురుషుల విభాగంలో శ్రీకాం త్‌తోపాటు, గతవారం స్విస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్న హెచ్‌ఎస్ ప్ర ణయ్ కూడా టైటిల్ కోసం పోరాటం సాగించనున్నాడు.

క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్
డ్రాతో ఆనంద్ నిష్క్రమణ
మాస్కో మార్చి 28: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో పోటీపడే అవకాశా న్ని దక్కించుకోవాలన్న భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఆశలు ఆ విరయ్యాయ. హాలెండ్‌కు చెందిన హనీష్ గిరితో జరిగిన కీలక పోరులో అ తను ఓటమి అంచున నిలిచినప్పటికీ, అతి కష్టం మీద డ్రా చేసుకున్నాడు. అ యతే, ఈఏడాది నవంబర్‌లో డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌తో తలపడే అవకాశాన్ని కోల్పోయాడు. గెలిస్తే తప్ప రేసులో ఉండే అవకాశంలేని 13వ రౌండ్‌లో ఆనంద్ డ్రాతో సంతృప్తి చెందడంతో కార్ల్‌సెన్‌తో తలపడే అవ కాశం సెర్గీ కర్జాకిన్ లేదా ఫాబినో కరౌనాకు దక్కుతుంది. కాగా, పదేళ్లలో ఆనంద్ లేకుండా ప్రపంచ చాంపియన్‌షిప్ తొలిసారి జరగనుంది.