క్రీడాభూమి
మారథాన్ మ్యాచ్‌లో హాలెప్ విజయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెల్బోర్న్, జనవరి 20: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మహిళల సింగిల్స్‌లో శనివారం ప్రపంచ నంబర్ వన్ సిమోనా హాలెప్, లారెన్ డావిస్ మధ్య జరిగిన మారథాన్ మ్యాచ్ ప్రేక్షకులను అలరించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో హాలెప్ అతి కష్టం మీద విజయం సాధించి, ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. మొదటి సెట్‌ను 4-6 తేడాతో కోల్పోయిన హాలెప్ రెండో సెట్‌లో పుంజుకొని ఎదురుదాడి చేసింది. ప్రత్యర్థిని 6-4 తేడాతో ఓడించింది. ఇరువురు చెరొక సెట్‌ను గెల్చుకోవడంతో, మూడో సెట్ ఆసక్తిని పెంచింది. అందుకు తగినట్టుగానే హాలెప్, లారెన్ నువ్వా? నేనా? అన్న చందంగా పోరాటం సాగించారు. చివరికి ఆ సెట్‌ను హాలెప్ 15-13 తేడాతో తన ఖాతాలో వేసుకుంది.
రద్వాన్‌స్కాకు షాక్
గతంలో ప్రపంచ ‘టాప్-10’ ర్యాంక్స్‌లో చోటు సంపాదించిన అగ్నీస్కా రద్వాన్‌స్కాకు మూడో రౌండ్‌లో చుక్కెదురైంది. హీచ్ సూ వెయ్ 6-2, 7-5 తేడాతో గెలిచి రద్వాన్‌స్కాకు షాకిచ్చింది.
చిత్రం..సిమోనా హాలెప్