క్రీడాభూమి

ఫెదరర్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 20: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్ దూకుడును కొనసాగిస్తున్నాడు. శనివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో రిచర్డ్ గాస్క్వెట్‌ను 6-2, 7-5, 6-4 తేడాతో ఓడించి, ప్రీ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. కెరీర్‌లో ఇంత వరకూ 19 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించి రికార్డు సృష్టించిన ఫెదరర్ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందంజ వేస్తున్నాడు.
జొకోవిచ్ జోరు
ప్రపంచ మాజీ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ పూర్తి ఫిట్నెస్‌తో జోరు మీద ఉన్నాడు. మూడో రౌండ్‌లో అతను అల్బర్ట్ రమోస్ వినోలాస్‌ను 6-2, 6-3, 6-3 తేడాతో ఓడించాడు. మోచేతి గాయం కారణంగా సుమారు ఎనిమిది నెలలు అంతర్జాతీయ పోటీలకు దూరమైన అతను ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్‌లో 14వ ర్యాంక్ ఆటగాడిగా పోటీకి దిగాడు. ఫిట్నెస్ సమస్య ఏమాత్రం లేకుండా అతను సులభంగా ప్రత్యర్థులను ఓడిస్తూ, టైటిల్ దిశగా దూసుకెళుతున్నాడు.
ఆసక్తికరంగా సాగిన ఒక మూడో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 25వ ర్యాంకర్ ఫాబియో ఫోగ్నినీ 3-6, 6-2, 6-1, 4-6, 6-3 తేడాతో జూలియన్ బెనెట్యూపై గెలుపొంది ప్రీ క్వార్టర్స్ చేరాడు. మొదటి సెట్‌ను చేజార్చుకున్న అతను ఆతర్వాత వరుసగా రెండు సెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, నాలుగో సెట్‌ను కోల్పోయాడు. దీనితో చివరిదైన ఐదో సెట్ ఇద్దరు ఆటగాళ్లకూ కీలకంగా మారింది. కానీ, సర్వశక్తులు ఒడ్డి పోరాడిన ఫోగ్నినీ ఆ సెట్‌ను సాధించి, ముందంజ వేశాడు. కాగా, 19వ ర్యాంక్ ఆటగాడు థామస్ బెర్డిచ్ 6-3, 6-3, 6-2 స్కోరుతో జువాన్ మార్టిన్ డెల్ పొట్రోను ఓడించాడు.

జ్వెరెవ్ ఓటమి
జర్మనీకి చెందిన యువ సంచలన ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ పోరాటం ఆస్ట్రేలియా ఓపెన్‌లో మూడో రౌండ్‌తో ముగిసింది. దక్షిణ కొరియాకు చెందిన చుంగ్ హుయాన్ 5-7, 7-6, 2-6, 6-3, 6-0 తేడాతో జ్వెరెవ్‌ను ఓడించి ప్రీ క్వార్టర్స్ చేరాడు. ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌ల్లో ఇదీ ఒకటి.
కాగా, ప్రపంచ ఐదో ర్యాంక్ ఆటగాడు డామినిక్ థియామ్ కూడా ప్రీ క్వార్టర్స్ చేరాడు. మూడో రౌండ్‌లో అతను ఆడ్రియన్ మనారినోను 6-4, 6-2, 7-5 ఆధిక్యంతో ఓడించాడు.

చిత్రం..రోజర్ ఫెదరర్