క్రీడాభూమి

ఎవరికీ పట్టని వాట్సన్ రిటైర్మెంట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, మార్చి 28: షేన్ వాట్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం విరాట్ కోహ్లీ పరుగుల హోరులో కలిసిపోయింది. టి-20 వరల్డ్ కప్‌తోనే తన కెరీర్ ముగుస్తుందని వాట్నస్ ఇది వరకే ప్రకటించాడు. ఈటోర్నీలో ఆస్ట్రేలియా సెమీస్ చేరుకోలేకపోవడంతో, ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్ అతనికి కెరీర్‌లో చివరిది. భవిష్యత్తులో అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్), బిగ్‌బాష్ టోర్నీల్లో మాత్రమే కనిపిస్తాడు. కాగా, కెరీర్‌కు గుడ్‌బై చెప్తున్న వాట్సన్‌ను ఎవరూ పట్టించుకోలేదు. ప్రేక్షకులు, అభిమానులు కూడా ఆ విషయాన్ని గమనించలేదు. మొహాలీ స్టేడియంలో అధికారులు, ఇరు జట్ల ఆటగాళ్లు, కామెంటేటర్లు, అంపైర్లు, రిఫరీలు మాత్రమే అతనికి వీడ్కోలు పలికారు. కోహ్లీ భజనలో నిమగ్నమయ్యారు. మొత్తానికి వాట్సన్ రిటైర్మెంట్ ఎలాంటి ప్రాధాన్యం లేకుండా సాదాసీదాగా జరిగిపోయింది.