క్రీడాభూమి

రహానేకు చోటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్: మొదటి రెండు టెస్టుల్లోనూ ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కించుకోలేకపోయిన బ్యాట్స్‌మన్ అజింక్య రహానే బుధవారం నుంచి ప్రారంభమయ్యే చివరి, మూడో టెస్టులో ఆడే అవకాశాలున్నాయి. జట్టుకు వైస్ కెప్టెన్‌గా రహానేను సెలక్టర్లు ఎంపిక చేసినప్పటికీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవి శాస్ర్తీ అతని పట్ల మొగ్గు చూపలేదు. రహానే వనే్డలకు మాత్రమే పనికొస్తాడని, టెస్టు మ్యాచ్‌ల్లో అలాంటి ఆటగాడిని ఎవరూ కోరుకోరని ఒక ఇంటర్వ్యూలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కేప్ టౌన్‌లో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా పరాజయాన్ని ఎదుర్కొన్న మరుక్షణం నుంచే కోహ్లీ తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. వైస్ కెప్టెన్‌కు తుది జట్టులో ఎందుకు చోటు కల్పించలేదంటూ రహానే అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. విశే్లషకులు, క్రీడా పండితులు సైతం రహానేను తీసుకోవాలని సూచించారు. కానీ, మొండితనానికి మారుపేరైన కోహ్లీ సెంచూరియన్‌లో జరిగిన రెండో టెస్టులో కూడా రహానేను ఆడించలేదు. ఆ మ్యాచ్‌లోనూ ఓడిన టీమిండియా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. ఈ ఫలితం వెలువడిన తర్వాత మరోసారి కోహ్లీ తీరును క్రికెట్ అభిమానులు ఎండగట్టారు. కోహ్లీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని విమర్శించారు. అన్ని వైపుల నుంచి రహానేకు మద్దతు పెరగడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో అతనిని మూడో టెస్టులో ఆడించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్టు సమాచారం. అయితే, అధికారికంగా తుది జట్టును ఇంకా ప్రకటించలేదు.

చిత్రం..అజింక్య రహానే