క్రీడాభూమి

అనుష్కపై విమర్శలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: బాలీవుడ్ నటి అనుష్క శర్మను విమర్శించడం సిగ్గుచేటని భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రతి విషయానికీ అనుష్క పేరును మధ్యలోకి తీసుకురావడం సోషల్ మీడియాలో ఫ్యాషన్‌గా మారిందని, ఇలాంటి వారంతా విద్యావంతులని చెప్పుకోవడానికి సిగ్గుపడాలని మండిపడ్డాడు. క్రికెట్‌తో ఏమాత్రం సంబంధం లేని ఆమెను తరచు విమర్శించడంలో అర్థం లేదన్నాడు. ‘వేధింపులకు గురవుతున్న అనుష్క స్థానంలో మీ చెల్లినో, గర్ల్‌ఫ్రెండ్‌నో, భార్యనో ఊహించుకోండి. ఆ బాధ ఏమిటో మీకే అర్థమవుతుంది’ కోహ్లీ ట్విటర్‌లో వ్యాఖ్యానించాడు. అనుష్క తనకు అండగా నిలిచిందే తప్ప వైఫల్యాలకు ఎన్నడూ కారకురాలు కాలేదని స్పష్టం చేశాడు. క్రికెట్‌తో అనుష్కకు ఏ సంబంధం ఉందని ఆమె వెంటపడుతున్నారని నిలదీశాడు. ఈ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు.
ఓటమి తప్పదని అనుకున్నా!
ఇన్నింగ్స్ సగ భాగం పూర్తయ్యే సమయానికి గెలుస్తామన్న ఆశలు సన్నగిల్లాయని, ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమిస్తామనే అనుకున్నానని భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అన్నాడు. సాధించాల్సిన రన్‌రేట్ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అసలు లక్ష్యాన్ని సాధించగలుతామా లేదా అన్న అనుమానం తనను వేధించిందని చెప్పాడు. కెప్టెన్ ధోనీతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా తాను అపనమ్మకంతోనే ఉన్నట్టు ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అసలు టార్గెట్‌ను ఎలా ఛేదించామో కూడా తనకు అర్థం కావడం లేదన్నాడు. భారీ రన్‌రేట్‌ను నమోదు చేసిన టీమిండియా గెలవడంతో తన వంతు పాత్ర పోషించినందుకు ఎంతో సంతోషిస్తున్నానని చెప్పాడు. ధోనీ మద్దతు లేకపోతే తనకు ఇది సాధ్యమయ్యేది కాదని అన్నాడు. ‘జేమ్స్ ఫాల్క్‌నెర్ 18వ ఓవర్ వేయడానికి సిద్ధమవుతున్నప్పుడు, కనీసం 15 పరుగులు సాధించాలని నిర్ణయించుకున్నాను. మూడు ఓవర్లలో 39 పరుగులు అవసరమైనప్పుడు ఒక ఓవర్‌లో భారీగా పరుగులు చేస్తేనే పోటీలో నిలబడగలుగుతామని, ఒత్తిడి తగ్గుతుందని నాకు తెలుసు. ఆ ఓవర్‌లో 19 పరుగులు లభించడంతో కొంత ఊరట చెందాను. ఫోర్లు, సిక్సర్లు కొట్టకపోతే లాభం లేదని అనుకున్నాను. అందుకే ఎదురుదాడికి దిగాను. ధోనీ కూడా చక్కటి మద్దతునిచ్చాడు. మొత్తం మీద భారత్ గెలిచింది. ఒక ఆటగాడికి ఇంతకంటే ఏం కావాలి’ అన్నాడు. తన కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచిపోతుందని కోహ్లీ పేర్కొన్నాడు.