క్రీడాభూమి

అసాధారణ ఇన్నింగ్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, మార్చి 28: టి-20 వరల్డ్ కప్‌లో ఆదివారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ భారత్‌ను విజయపథంలో నడిపించిన తీరును ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ కొనియాడాడు. కోహ్లీ ఒక అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడని కితాబునిచ్చాడు. బ్యాటింగ్ చేసేందుకు చాలా కష్టంగా మారిన వికెట్‌పై కోహ్లీ విజృంభణను ఎవరూ ఊహించలేదని చెప్పాడు. ‘అసాధ్యంగా కనిపించిన విజయాన్ని కోహ్లీ సుసాధ్యం చేసి, మా జట్టును దెబ్బతీశాడు. అతను ఆడిన తీరుకు హ్యాట్సాఫ్’ అన్నాడు. కోహ్లీ మిగతా వారికి భిన్నమైన ఆటగాడని స్మిత్ అన్నాడు. ఓటమి బాధాకరంగా ఉన్నప్పటికీ, ఒక మంచి మ్యాచ్‌ని ఆడామన్న సంతృప్తి మిగిలిందని చెప్పాడు. ఈ మ్యాచ్‌తోనే వాట్సన్ కెరీర్‌కు తెరపడడం కూడా ఆస్ట్రేలియాకు నష్టం కలిగించే అంశమని పేర్కొన్నాడు. చి వరి లీగ్ మ్యాచ్‌కి తాము అన్ని విధాలా సిద్ధమ య్యామని స్మిత్ అన్నాడు. కానీ క్రికెట్‌లో ఏదైనా జ రగవచ్చని మరోసారి రుజువైందని చెప్పాడు.
ఆసీస్ మీడియా సైతం..
సహజంగా ప్రత్యర్థి జట్లనుగానీ, ఆటగాళ్లను గానీ విమర్శించడమే తప్ప ఎన్నడూ మెచ్చుకోని ఆస్ట్రేలియా మీడియా కూడా కోహ్లీని ఆకాశానికి ఎత్తేసింది. టి-20 వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బాగానే ఆడినప్పటికీ కోహ్లీ కారణంగానే ఓడిందని పేర్కొంది. అతని ఆట అద్భుతమని అభినందించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ కోహ్లీ ఎంతో బాధ్యతగా ఆడాడని, అతని లాంటి ఆటగాడు ఉన్నప్పుడు భారత్ గెలవడంలో విచిత్రమేమీ లేదని వ్యాఖ్యానించింది.