క్రీడాభూమి

క్వార్టర్ ఫైనల్స్‌లో ఎవరితో ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సోమవారం మూడు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ఎనిమిదో ర్యాంక్ క్రీడాకారిణి కరోలిన్ గార్సియాను మాడిసన్ కీస్ ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో 14వ సీడ్‌గా బరిలోకి దిగిన మాజీ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌పై చుంగ్ హియాన్ సంచలన విజయాన్ని నమోదు చేశాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ డామినిక్ థియేమ్‌పై టెనిస్ శాండ్‌గ్రీన్ గెలుపొంది క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. ఈ టోర్నమెంట్ ముగిసేలోగా ఇంకెన్ని సంచలనాలు చోటు చేసుకుంటాయో చూడాలి
*
పురుషుల సింగిల్స్
రోజర్ ఫెదరర్ ఒ థామస్ బెర్డిచ్
రాఫెల్ నాదల్ ఒ మారిన్ సిలిక్
గ్రిగరీ దిమిత్రోవ్ ఒ కేల్ ఎడ్మండ్
టెనిస్ శాండ్‌గ్రీన్ ఒ చుంగ్ హియాన్
మహిళల సింగిల్స్
సిమోనా హాలెప్ ఒ కరోలిన్ ప్లిస్కోవా
ఏంజెలిక్ కెర్బర్ ఒ మాడిసన్ కీస్
ఎలిస్ మెర్టెన్స్ ఒ ఎలినా స్విటోలినా
కార్లా సౌరెజ్ నవరో ఒ కరోలినా వొజ్నియాకి
*
చిత్రం.. నొవాక్ జొకోవిచ్