క్రీడాభూమి

దూకుడును కొనసాగించు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, మార్చి 28: దూకుడుగా ఆడడాన్ని మరచిపోవద్దని యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హితవు పలికాడు. ఇటీవల కాలంలో కోహ్లీ ప్రశాంతను అలవాటు చేసుకుంటున్నాడని ఒక ఇంటర్వ్యూలో ధోనీ అన్నాడు. ఉద్వేగానికి గురికాకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతామని చెప్పాడు. అయితే, అదే సమయంలో దూకుడుగా ఉండడం కోహ్లీ స్వతఃసిద్ధమైన అలవాటని, దానిని మానుకోరాదని హితవు చెప్పాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ప్రతి క్షణం చాలా ఉద్విగ్నంగా కొనసాగిందని అన్నాడు. ఇలాంటి పోరాటాలను పదేపదే చూసేందుకు వీలుండదని వ్యాఖ్యానించాడు.