క్రీడాభూమి

ఎందుకలా జరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: దక్షిణాఫ్రికా టూర్‌లో భారత్ ఘోర వైఫల్యంపై విశే్లషణ, సమీక్షకు రంగం సిద్ధమైంది. భారత్ ఇంత ఘోరంగా పరాజయం పాలుకావడానికి కారణం ఏమిటన్న దానిపై బీసీసీఐ నిర్వహించే అడ్మినిస్ట్రేటర్ల కమిటీ దృష్టి సారించబోతోంది. కేప్‌టౌన్, సెంటూరియన్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడిన భారత్, సరీస్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. రేపటినుంచి మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న దృష్ట్యా భారత ఆటగాళ్ల ఇంత పేలవమైన ఆటతీరును ఎందుకు కనబర్చారన్న దాన్ని విశే్లషించాల్సిన అవసరం ఉందని నిర్వాహకుల కమిటీ అధినేత వినోద్ రాయ్ పేర్కొన్నారు. రేపు భారత్ మ్యాచ్ గెలిచినా, ఓడినా ఎలాంటి తేడా ఉండదు. అయితే అందరినుంచి పూర్తిస్థాయి లభించినా, టీం మేనేజర్ కూడా పూర్తి ప్రోత్సాహాన్ని అందించినా భారత ఆటగాళ్లు ఎందుకు సరిగా ఆడలేకపోయారన్నది పరిశీలించాల్సిన విషయమన్నారు. అయితే, ఇప్పటికిప్పుడు ఆ వైఫల్యంపై దృష్టిపెట్టే అవకాశం లేదని, కారణం ఇటు అధికారులు, అటు ఆటగాళ్లు దక్షిణాఫ్రియాలోనే ఉన్నారని తెలిపారు. నేడు జరిగిన సమావేశంలో వినోద్‌రాయ్‌తో పాటు సభ్యులు డయానో ఎడూజీ, బీసీసీఐ సిఈవో రాహుల్ జోహ్రీలు పాల్గొన్నారు. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సికె ఖన్నా, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి సహా కార్యవర్గ సభ్యులు ఎవరినీ ఈ సమావేశానికి పిలవలేదు. అయితే, ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలంటూ అనేక అంశాలు ఇప్పటికే వెలుగు చూశాయి. అయితే మాజీ ఆటగాళ్లు మాత్రం ఎలాంటి సన్నద్ధత లేకుండా భారత్ ఆ మ్యాచ్ ఆడిందని, అదికూడా పరాజయానికి కారణమై ఉండొచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా సౌతాఫ్రికా టూర్‌కు ముందు శ్రీలంకతో ఆడటం అన్నది అంత సరైన ఆలోచన కాదని హర్బజన్ సింగ్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు పది రోజులపాటు భారత ఆటగాళ్లకు సంసిద్ధమయ్యే అవకాశం ఇచ్చివుంటే ఫలితం మరోలా ఉండేదని భారత కోచ్ రవిశాస్ర్తీ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.