క్రీడాభూమి

వ్యూహాత్మకంగానే వెళ్తున్నాం:మిథాలీరాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 23: దక్షిణాఫ్రికా టూర్‌కు ముందుగా వెళ్లడం వల్ల అక్కడి వాతావరణానికి అలవాటుపడి జట్టు రాణించే అవకాశం ఉంటుందని భారత మహిళా క్రికెట్ స్కిప్పర్ మిథాలీ రాజ్ అన్నారు. ఫిబ్రవరి 5నుంచి కింబర్లీలో జరగనున్న మూడు వనే్డ మ్యాచ్‌ల సిరీస్ కోసం మిథాలీ సారథ్యంలోని మహిళా జట్టు దక్షిణాఫ్రికా టూర్‌కు బుధవారం బయలుదేరుతోంది. ఈ టూర్‌లోనే ఫిబ్రవరి 13నుంచి పోచెఫ్‌స్ట్రూమ్‌లో టి-20 సిరీస్ కూడా జట్టు ఆడనుంది. జట్టు ముందుగానే సౌతాఫ్రికాకు బయలుదేరడంపై మీడియా ప్రశ్నించినపుడు ‘గత ఏడాది ఇంగ్లాండ్‌లో వరల్డ్ కప్‌కు వెళ్లినపుడూ ముందుగానే వెళ్లాం. అది జట్టుకు ఒకవిధంగా చాలా మంచిదైంది. ఉన్న సమయాన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లకు వాడుకున్నాం. అలాగే, పిచ్ పరిస్థితిని అర్థం చేసుకునే అవకాశం దక్కింది. ఉపఖండంలో వికెట్ల పరిస్థితిని ముందుగా అర్థం చేసుకోవడం వల్ల జట్టు రాణించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆ ఆలోచనతోనే టూర్‌కి జట్టు ముందుగా బయలుదేరుతోంది. అంతేకాదు, ఈసారి రెండు కొత్త బంతులతో మ్యాచ్‌లు ఆడాల్సిన పరిస్థితి ఉంది’ అని అన్నారు. ‘రెండు కొత్త బంతులతో ఆడుతోన్న మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఇవి. అక్కడి పరిస్థితులకు అలవాటుపడి జట్టు రాణించాలంటే ముందుగా వెళ్లక తప్పని పరిస్థితి’ అని 35ఏళ్ల మిథాలి వ్యాఖ్యానించారు. మిథాలీ వ్యూహాన్ని కోచ్ తుషార్ ఆరోథె బలపర్చారు. ‘ఉపఖండంలో కొత్త వాతావరణానికి అలవాటుపడటం అన్నది జట్టుకి చాలా అవసరం. ముందస్తు సమయంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లకూ అవకాశం ఉంటుంది. వరల్డ్ కప్ కోసం గత ఏడాది ఇంగ్లాండ్ టూర్‌కు పది రోజులు ముందుగా వెళ్లాం. అదే జట్టుకు ఉపకరించింది’ అని అరోథె అన్నారు. ఇదిలావుంటే, ఇప్పటికే దక్షిణాఫ్రికా టూర్‌లోవున్న భారత క్రికెట్ జట్టు ఘోర వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అన్ని సౌకర్యాలు కల్పించినా జట్టు ఎందుకు పేలవమైన ఆటతీరు కనబర్చిందన్న అంశంపై ఇప్పటికే బీసీసీఐ సమీక్షలకు సిద్ధమవుతోంది.