క్రీడాభూమి

ఏ నోట విన్నా కోహ్లీ నామస్మరణమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన అత్యంత కీకలమైన టి-20 వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించిన విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. ఎక్కడ చూసినా అతని నామస్మరణే. ఫైనల్‌ను గెల్చుకొని, ట్రోఫీని అందుకున్న తీరులో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. పలు నగరాలు, పట్టణాల్లో సోమవారం తెల్లవారు జాము వరకూ అభిమానులు త్రివర్ణ పతకాలను ధరించి ర్యాలీలతో, నృత్యాలతో, డప్పువాయిద్యాలతో హోరెత్తించారు. ‘కోహ్లీ.. కోహ్లీ..’ అన్న అభిమానుల అరుపులతో, కేరింతలతో దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఇక మొహాలీలో పరిస్థితి గురించి ఎంత చెప్పినా తక్కువే. పంజాబ్ గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకీ, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్, హర్యానా ఆర్థిక మంత్రి కెప్టెన్ అభిమన్యు, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా, సెలక్టర్ విక్రం రాథోడ్ తదితరులంతా మొహాలీ స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌ని తిలకించారు. తమ హోదాలను మరచిపోయి వారు కూడా సాధారణ అభిమానులతో కలిసి కేరింతలు కొట్టారు.
ప్రశంసల జల్లు
అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడి, 51 బంతుల్లో అజేయంగా 82 పరుగులు చేసి టీమిండియాను టి-20 వరల్డ్ కప్ సెమీస్ చేరిన కోహ్లీపై పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు. ‘చివరి వరకూ పోరాడి సాధించిన అద్భుత విజయమిది. ఇది అద్భుతమైన, ప్రత్యేక ఇన్నింగ్స్’ అని భారత లెజెండరీ బ్యాట్స్‌మన్ సచిన్ తెండూల్కర్ ట్వీట్ చేశాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా గుర్తింపు సంపాదించిన వెస్టిండీస్ మాజీ స్టార్ బ్రియాన్ లారా కూడా కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తాడు. బంతిని సరైన సమయంలో, సరైన దిశలో కొట్టే సత్తావున్న బ్యాట్స్‌మన్‌గా కోహ్లీని అభివర్ణించాడు. కోహ్లీ సహచరులు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్ కూడా కోహ్లీని అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కొనియాడారు. ఒకదాని తర్వాత మరొకటిగా విజయాలను సాధించిపెడుతున్న కోహ్లీకి హ్యాట్సాఫ్ అంటూ యువీ ట్వీట్ చేస్తే, అతని నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. ‘నా చిట్టి తమ్ముడిని చూసి గర్వపడుతున్నానను’ అని హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు గ్లేన్ మాక్స్‌వెల్, షేన్ వాట్సన్ తదితరులు కూడా కోహ్లీని ఆకాశానికి ఎత్తేశారు. ప్రశంసలతో ముంచెత్తారు.
లారాను మించిపోయాడు: చాపెల్
షాట్ల ఎంపికతోపాటు సరైన దిశలో బంతిని కొట్టడంలో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారాను కోహ్లీ మించిపోయాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. ఆధునిక క్రికెటర్లలో అద్భుతమైన టైమింగ్‌తో బంతిని, సరైన దిశగా కొట్టే ప్రతిభావంతుడిగా లారా పేరు సంపాదించాడని చాపెల్ అన్నాడువ. అయితే, కోహ్లీ షాట్ల తీరు అంతకంటే మెరుగ్గా ఉందని పేర్కొన్నాడు. మహమ్మద్ అజరుద్దీన్, వివిఎస్ లక్ష్మణ్, జహీర్ అబ్బాస్ వంటి క్రికెటర్ల కళాత్మక ఆటను తాను తిలకించానని అన్నాడు. వారి మణికట్టు విన్యాసం అనితర సాధ్యమని పేర్కొన్నాడు. అంతటి శక్తిసామర్థ్యాలు తనకు కోహ్లీలో కనిపించాయని ప్రశంసించాడు. బ్యాటింగ్‌కు పర్యాయ పదంగా కోహ్లీని పేర్కోవాల్సిన అవస రం ఉందని చాపెల్ అన్నాడు.