క్రీడాభూమి

న్యూజిలాండ్ స్పిన్ విభాగంపైనే ఇంగ్లాండ్ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయభేరి మోగించి, టాపర్‌గా నిలిచిన న్యూజిలాండ్ స్పిన్ విభాగంపైనే ఇంగ్లాండ్ దృష్టి పెట్టింది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో బుధవారం జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ స్పిన్ గెలుస్తుందా లేక ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆధిపత్యమే కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మ్యాచ్‌కి అన్ని విధాలా సిద్ధమైనట్టు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. మంగళవారం సహచరులతో కలిసి ముమ్మరంగా ప్రాక్టీస్ చేసిన అతను విలేఖరులతో మాట్లాడుతూ న్యూజిలాండ్ స్పిన్ విభాగం గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యుత్తమ ప్రమాణాలను అందుకుందని తెలిపాడు. అదే సమయంలో తాము కూడా స్పిన్‌ను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నాడు. ఇలావుంటే, 2010లో ఈ టోర్నీని కైవసం చేసుకున్న ఇంగ్లాండ్‌తో పోలిస్తే న్యూజిలాండ్‌కే ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశే్లషకులు అంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిర్వహించే ఏ అంతర్జాతీయ టోర్నీనీ ఇప్పటి వరకూ గెల్చుకోలేకపోయిన కివీస్ ఈసారి టైటిల్ రేసులో దూసుకుపోతున్నది. ‘అండర్ డాగ్’ ముద్రతో బరిలోకి దిగిన ఆ జట్టు మొదటి మ్యాచ్‌లోనే హాట్ ఫేవరిట్ టీమిండియాను 47 పరుగుల తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. అది అదృష్టవశాత్తు లభించిన గెలుపు కాదని నిరూపిస్తూ రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఎనిమిది పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్‌పై 22 పరుగులతో ఆధిక్యంతో గెలుపొందింది. చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 75 పరుగుల తేడాతో చిత్తుచేసి, గ్రూప్ దశలో క్లీన్‌స్వీప్‌తో సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. కేన్ విలియమ్‌సన్ నాయకత్వంలోని ఈ జట్టుకు ఎడమ చేతి వాటం స్పిన్నర్ మిచెల్ సాంట్నర్, లెగ్ బ్రేక్ బౌలర్ ఇష్ సోధీ ఇప్పటి వరకూ జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ అత్యుత్తమ సేవలు అందించారు. వీరి స్పిన్ ఇంగ్లాండ్‌ను కూడా కట్టడి చేస్తుందని ఆండర్సన్ నమ్ముతున్నాడు. సాంట్నర్ 15 ఓవర్లు బౌల్ చేసి 86 పరుగులిచ్చి తొమ్మిది వికెట్లు పడగొట్టగా, సోధీ 15.4 ఓవర్లలో 78 పరుగులకు ఎనిమిది వికెట్లు కూల్చాడు. కాగా, ఆల్‌రౌండర్ గ్రాంట్ ఇలియట్, ఎడమచేతివాటం పేసర్ మిచెల్ మెక్‌లీనగన్ కివీస్ బౌలింగ్ విభాగాన్ని పటిష్టష్టపరుస్తున్నారు. టోర్నీకి ఎంపిక చేసిన మొత్తం 15 మంది ఆటగాళ్లలో 13 మందిని జట్టు మేనేజ్‌మెంట్ ఇప్పటికే మ్యాచ్‌లు ఆడించింది. సెమీ ఫైనల్‌లోనూ ప్రయోగాలు చేస్తుందా లేక చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఆడిన జట్టును యథాతథంగా బరిలోకి దించుతుందా అన్నది చూడాలి.
బ్యాటింగే ఇంగ్లాండ్ బలం
న్యూజిలాండ్ బౌలింగ్ బలంపై బరిలోకి దిగుతుండగా, ఇంగ్లాండ్‌కు బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, అలెక్స్ హాలెస్, జాసన్ రొయ్, జో రూట్ వంటి మేటి ఆటగాళ్లతో ఆ జట్టు బ్యాటింగ్ బలమైన పునాదులపై నిలిచింది. బౌలింగ్‌లో డేవిడ్ విల్లే, క్రిస్ జోర్డాన్, బెన్ స్టోక్స్, అదిల్ రషీద్, మోయిన్ అలీలలో ఎవరికి తుది జట్టులో స్థానం దక్కుతుందన్నది ఆసక్తిని రేపుతున్నది. మొత్తం మీద న్యూజిలాండ్ బౌలింగ్, ఇంగ్లాండ్ బ్యాటింగ్ మధ్య బుధవారం సంకుల సమరం జరగనుంది. గెలుపు ఓటములు ఎలావున్నా, పోటీ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తున్నది.
బుధవారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలు