క్రీడాభూమి

హెరాత్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా: శ్రీలంక స్పిన్నర్ రంగన హెరాత్ శనివారం బంగ్లాదేశ్‌తో ముగిసిన రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు సాధించే క్రమంలో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో ఎక్కువ వికెట్లు సాధించిన ఎడమచేతి వాటం బౌలర్‌గా అతను వసీం అక్రం రికార్డును అధిగమించాడు. 89 టెస్టులు (162 ఇన్నింగ్స్) ఆడిన హెరాత్ 24,920 బంతులు బౌల్ చేశాడు. 11,654 పరుగులిచ్చి 415 వికెట్లు పడగొట్టాడు. 127 పరుగులకు తొమ్మిది వికెట్లు అతని అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణ. కాగా, అక్రం 104 టెస్టులు (181 ఇన్నింగ్స్) ఆడి 22,627 బంతులు వేసి, 9,779 పరుగులిచ్చి 414 వికెట్లు సాధించాడు. అత్యుత్తమంగా 119 పరుగులకు ఏడు వికెట్లు కూల్చాడు.