క్రీడాభూమి

చివరి టెస్టులో బంగ్లాదేశ్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, ఫిబ్రవరి 10: శ్రీలంకతో జరిగిన చివరి, రెండో టెస్టులో బంగ్లాదేశ్ చిత్తయింది. భారీ స్కోర్లు నమోదైన మొదటి టెస్టు డ్రాకాగా, రెండో టెస్టులో శ్రీలంక మొదటి నుంచి చివరి వరకూ ఆధిపత్యాన్ని కొనసాగించి, 215 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 65.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (68), రోషన్ సిల్వ (56) అర్ధ శతకాలతో రాణించారు. అబ్దుల్ రజాక్, తైజుల్ ఇస్లాం చెరి నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 45.4 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. మెహదీ హసన్ 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లింటన్ దాస్ 25 పరుగులు చేశాడు. సురంగ లక్మల్, అకిల ధనంజయ చెరి మూడు వికెట్లు సాధించారు. కాగా, 112 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 73.5 ఓవర్లలో 226 పరుగులు సాధించింది. రోషన్ సిల్వ 70 పరుగులు చేశాడు. తైజుల్ ఇస్లాం నాలుగు, ముస్త్ఫాజుర్ రహ్మాన్ మూడు వికెట్లు కూల్చారు. 339 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడానికి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ 29.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది. మోమినుల్ హక్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అకిల ధనంజయ ఐదు వికెట్లు పడగొట్టగా, రంగన హెరాత్‌కు నాలుగు వికెట్లు లభించాయి.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 65.1 ఓవర్లలో 222 ఆలౌట్ (కుశాల్ మెండిస్ 68, రోషన్ సిల్వ 56, దిల్‌రువాన్ పెరెరా 31, అబ్దుల్ రజాక్ 4/63, తైజుల్ ఇస్లాం 4/83).
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 45.4 ఓవర్లలో 110 ఆలౌట్ (మెహదీ హసన్ 38, లింటన్ దాస్ 25, అకిల ధనంజయ 3/20, సురంగ లక్మల్ 3/25, దిల్‌రువాన్ పెరెరా 2/32).
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 73.5 ఓవర్లలో 226 ఆలౌట్ (రోషన్ సిల్వ 70, దిముత్ కరుణరత్నే 32, తైజుల్ ఇస్లాం 4/76, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 3/49, మెహదీ హసన్ 2/37).
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ (విజయ లక్ష్యం 339): 29.3 ఓవర్లలో 123 ఆలౌట్ (మోమినుల్ హక్ 33, ముష్ఫికర్ రహీం 25, అకిల ధనంజయ 5/24, రంగన హెరాత్ 4/49).