క్రీడాభూమి

నాలుగో వనే్డకి వర్షం బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, ఫిబ్రవరి 10: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం నాటి నాలుగో వనే్డని వర్షం వెంటాడుతున్నది. భారత్ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు ఒకసారి ఆటకు అంతరాయం కల గ్గా, దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఉరుములు, మెరుపు లు, వర్షం జల్లు కారణంగా మరోసారి ఆట నిలిచింది. 290 పరు గుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 7.2 ఓవ ర్లలో ఒక వికెట్ కోల్పోయ 43 పరుగులు చేసింది. ఈ దశలో మె రుపులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోగా, ఆటను నిలిపే శారు. భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి దాటే వరకూ వేచి చూసి ఆతర్వాత నిర్ణయం తీసుకుంటారు.
మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను కోల్పోయింది. రోసిత్ శర్మ కేవలం ఐదు పరుగులు చేసి, కాగిసో రబదా బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసిన ఓపెనర్ శిఖర్ ధావన్ దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరి భాగస్వామ్యంలో, రెండో వికెట్‌కు 158 పరుగులు జత కలిశాయి. 83 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 75 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీని డేవిడ్ మిల్లర్ క్యాచ్ అందుకోగా క్రిస్ మోరిస్ ఔట్ చేశాడు. ఆతర్వాత కొద్ది సేపటికే ధావన్ వికెట్ కూడా కూలింది. 105 బంతులు ఎదుర్కొన్న అతను 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 109 పరుగులు సాధించి, మోర్న్ మోర్కెల్ బౌలింగ్‌లో ఎబీ డివిలియర్స్ బౌలింగ్‌కు చిక్కాడు. అజింక్య రహానే (8), శ్రేయాస్ అయ్యర్ (18) హార్దిక్ పాండ్య (9), భువనేశ్వర్ కుమార్ (5) పరుగుల వేటలో వికెట్లు పారేసుకున్నారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బాధ్యతాయుతంగా ఆడుతూ 43 బంతుల్లో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొత్తం మీద 50 ఓవర్లలో భారత్ ఏడు వికెట్లకు 289 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కాగిసో రబదా, లున్గీ ఎన్డిగి చెరి రెండు వికెట్లు పడగొట్టారు.