క్రీడాభూమి

చివరి వనే్డలో మిథాలీ సేన ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోచెస్ట్రూమ్, ఫిబ్రవరి 10: భారత్, దక్షిణాఫ్రికా మహిళా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ శనివారం ముగిసింది. మొదటిమూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు గెల్చుకొని, సిరీస్‌ను సొంతం చేసుకున్న మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత జట్టుకు క్లీన్‌స్వీప్ దక్కలేదు. చివరిదైన మూడో వనే్డలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు 50 ఓవర్లలో 240 పరుగులు చేసింది. దీప్తి శర్మ 79 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, వేదా కృష్ణమూర్తి 56 పరుగులు సాధించింది. చివరిలో శిఖా పాండే 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ 39 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టింది. అనంతరం దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. లారా ఊల్వర్ట్ 59 పరుగులు చేయగా, మిగ్నన్ డు ప్రీజ్ 90 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచింది.
సంక్షిప్త స్కోర్లు
భారత మహిళల ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 240 ఆలౌట్ (దీప్తి శర్మ 79, వేదా కృష్ణమూర్తి 56, శిఖా పాండే 31 నాటౌట్, షబ్నిమ్ ఇస్మాయిల్ 4/30, చో ట్రయాన్ 2/48).
దక్షిణాఫ్రికా మహిళల ఇన్నింగ్స్: 49.2 ఓవర్లలో 3 వికెట్లకు 241 (లారా ఊల్వర్ట్ 59, ఆండ్రి స్టెయిన్ 30, మిగ్నన్ డు ప్రీజ్ 90 నాటౌట్, డేన్ వాన్ నికెర్క్ 41 నాటౌట్).