క్రీడాభూమి

ప్రత్యక్షమైన కిమ్, ట్రంప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 10: వింటర్ ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకే చోట కనిపించడంతో ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలతో నోళ్లు తెరిచారు. ఇంతకీ వీరు అసలైన నేతలుకారని, వారి డూప్‌లు అని తెలుసుకొని నవ్వుకున్నారు. రంగస్థలంపై హోవర్డ్ ఎక్స్ అని పేరుపెట్టుకున్న నటుడు అచ్చుగుద్దినట్టు కిమ్‌ను పోలి ఉంటాడు. డెనిస్ అలాన్‌ను హఠాత్తుగా చూస్తే ఎవరైనా ట్రంప్ అనుకోవాల్సిందే. వీరిద్దరూ కలిసి వింటర్ ఒలింపిక్స్‌కు రావడంతో, సహజంగా అందరి కళ్లూ వారిపై పడ్డాయి. విలేఖరులు కూడా ఫొటోలు తీసుకోవడానికి వారి చుట్టూ మూగారు. దీనితో పోలీసులు జోక్యం చేసుకొని, హోవర్డ్ ఎక్స్, డెనిస్ అలాన్‌ను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు.