క్రీడాభూమి

‘సంయుక్త’ జట్టుకు జేజేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 10: వింటర్ ఒలింపిక్స్‌లో శనివారం మహిళల ఐస్ హాకీ ఆసక్తి రేపింది. ఈ విభాగంలో ఉభయ కొరియా దేశాలు ఒకే జట్టుగా బరిలోకి దిగడమే అందుకు కారణం. ఈ సంయుక్త జట్టును ప్రేక్షకులు జేజేలు పలికారు. ఆ జట్టు సభ్యులు రింక్‌లోకి వచ్చిన వెంటనే పెద్దఎత్తున హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంయుక్త కొరియా జట్టు ఫేవరిట్ కాకపోయినప్పటికీ, చిరకాల శత్రువులుగా ఉన్న రెండు దేశాల క్రీడాకారిణులు సంయుక్త జట్టుగా ఏర్పడడంతో, అందరి దృష్టి ఆ మ్యాచ్‌పైనే కేంద్రీకృతమైంది. అనుకున్న విధంగానే స్విట్జర్లాండ్ 5-0 తేడాతో కొరియాను చిత్తుచేసింది. తొలి మ్యాచ్‌లోనే ఓడినప్పటికీ, సంయుక్త కొరియా జట్టు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది.
కాగా, మరో మ్యాచ్‌లో స్వీడన్ 2-1 గోల్స్ ఆధిక్యంతో జపాన్‌ను ఓడించింది. బరిలో ఉన్న బలహీనమైన జట్లలో జపాన్ కూడా ఒకటి. ఈ పోటీల్లో పోడియం ఫినిష్ చేయాలని స్వీడన్ అనుకుంటే, చాలా కష్టపడాల్సి ఉంటుందని విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

వింటర్ ఒలింపిక్స్‌లో భాగంగా షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ఈవెంట్‌లో పోటీ జరుగుతున్న సమయంలో చార్లొట్ గిల్మార్టిన్, ఎమిలీ మాలగిచ్, పెట్రా జస్జాప్టీ పరస్పరం ఢీకొన్నారు. ఈ సంఘటనలో గిర్మార్టిన్ గాయపడింది. అయితే, మహిళల 1,000, 1,500 మీటర్ల షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్‌లో ఆమె పోటీపడే అవకాశాలున్నాయని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇలావుంటే, ముగ్గురు స్కేటర్లు ఢీకొని కిందపడినప్పటికీ, వేగాన్ని ఏమాత్రం తగ్గించుకోని చాయ్ మింగ్ జియాన్ అందరికంటే ముందుగా లక్ష్యాన్ని చేరి, క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు సంపాదించింది. ఈ క్రమంలో ఆమె వింటర్ ఒలింపిక్స్ రికార్డును బద్దలు చేయడం విశేషం.

చిత్రం..‘సంయుక్త’ కొరియా జట్టుకు జేజేలు పలుకుతున్న ప్రేక్షకులు