క్రీడాభూమి

చర్చల్లో బిజీ..బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 10: ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు ద్వైపాక్షిక చర్చలకు వింటర్ ఒలింపిక్స్‌ను వేదికగా ఎంచుకున్నట్టు కనిపిస్తున్నది. ఈ పోటీలను తిలకించడానికి వచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షడు కిమ్ చాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్, బృందానికి నాయకత్వం వహించిన కిమ్ యాంగ్ నమ్‌తో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జయే ఇన్ చర్చలు జరిపాడు. అధికార నివాసమైన బ్లూ హౌస్‌కు జాంగ్, నమ్‌ను ఆహ్వానించిన మూన్ వారికి ఎదురువెళ్లి స్వాగతం పలికాడు. అనంతరం ముగ్గురు వివిధ అంశాలపై చాలాసేపు చర్చించుకున్నారు. వీరి మధ్య జరిగిన చర్యల సారాంశం ఏమిటో బయటకు రాకపోయినా, ద్వైపాక్షిక సంబంధాలపైనే దృష్టి పెట్టి ఉంటారని స్థానిక మీడియా పేర్కొంది. కాగా, వింటర్ ఒలింపిక్స్‌ను చూడడానికి వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తోనూ మూన్ చర్చలు జరిపాడు. వీరిద్దరూ మహిళల ఐస్ హాకీ మ్యాచ్‌ని పక్కపక్కనే కూర్చొని తిలకరించారు. మ్యాచ్ జరుగతున్నంత సేపు వీరు చర్చల్లో మునిగిపోవడం కనిపించింది.

చిత్రం..ఉత్తర కొరియా బృంద ఉన్నతాధికారి కిమ్ యాంగ్ నమ్,
ఆ దేశ అధ్యక్షుడు కిమ్ చాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్‌తో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జయే ఇన్ (ఎడమ)