క్రీడాభూమి

కల్లాకు తొలి స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 10: ఈసారి వింటర్ ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణ పతకం స్వీడన్‌కు చెందిన చార్లొట్ కల్లాకు లభించింది. మహిళల 7.5+7.5 కిలోమీటర్ల స్కియాథ్లాన్ క్రాస్ కంట్రీ ఈవెంట్‌లో ఆమె విజేతగా నిలిచింది. నార్వే స్కీయర్ మారిట్ జోర్గెన్ రజత పతకంతో సంతృప్తి చెందడం గమనార్హం. 11 వింటర్ ఒలింపిక్ పతకాలు సాధించి, మరోసారి సత్తా చాటుదామనుకున్న జోర్గెన్‌కు కల్లా షాకిచ్చింది. ఆమె 40 నిమిషాల 44 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసింది. కల్లా కంటే 7.8 సెకన్లు ఆలస్యంగా లక్ష్యాన్ని చేరిన జోర్గెన్‌కు ద్వితీయ స్థానం దక్కింది. ఫిన్లాండ్‌కు చెందిన క్రిస్టా పర్మాకొస్కీ కాంస్య పతకాన్ని అందుకుంది.
మహిళల బయథ్లాన్: మహిళల బయథ్లాన్‌లో భాగంగా జరిగిన స్ప్రింట్ ఈవెంట్‌ను లారా దహిమెర్ (జర్మనీ) గెల్చుకుంది. ఆమె 21:06.2 నిమిషాల్లో రేస్‌ను పూర్తి చేసింది. నార్వేకు చెందిన మార్టె ఒల్స్‌బూ (21:30.4 నిమిషాలు) రజత పతకాన్ని గెల్చుకోగా, చెక్ రిపబ్లిక్ స్కీయర్ వెరోనికా విక్టోవా (21:32 నిమిషాలు) కాంస్య పతకాన్ని సంపాదించుకుంది.
షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్: షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ పురుషుల 1,500 మీటర్ల విభాగంలో దక్షిణ కొరియా స్కేటర్ లిమ్ హ్యోజున్ స్వర్ణ పతకం సాధించాడు. నెదర్లాండ్స్‌కు చెందిన సిన్కీ నెట్‌కు రజతం, రష్యా స్కేటర్ సెమియోన్ ఎలిస్ట్రాటొవ్‌కు కాంస్యం లభించాయి.
స్పీడ్ స్కేటింగ్: స్పీడ్ స్కేటింగ్ మహిళల 3,000 మీటర్ల రేస్‌ను నెదర్లాండ్స్‌కు చెందిన కర్లిన్ అచెరీట్ కైవసం చేసుకుంది. ఆమె 3:59.21 నిమిషాల్లో రేస్‌ను పూర్తి చేసింది. రజత, కాంస్య పతకాలు కూడా నెదర్లాండ్స్‌కే దక్కడం విశేషం. ఇరీన్ విస్ట్ 3:59.29 నిమిషాలతో రజత పతకాన్ని అందుకోగా, 4 నిమిషాల్లో గమ్యాన్ని చేరిన ఆంటోనిట్ డి జాంగ్‌కు కాంస్య పతకం లభించింది.