క్రీడాభూమి

సచెన్కో, మాసట్ ప్రపంచ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘ్ఘ్ఘపయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 15: పెయిర్స్ స్కేటింగ్‌లో గురువారం సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. అలొనా సచెన్కో, బ్రూనో మాసట్ జోడీ 235.90 పాయింట్లు సంపాదించి, గతంలో తాము నెలకొల్పిన రికార్డును తామే బద్దలు చేశారు. జర్మనీకి చెందిన ఈ ఫిగర్ స్కేటర్లు ఎక్కడా చిన్న పొరపాటు కూడా దొర్లకుండా జాగ్రత్త పడుతూ, చైనాకు చెందిన సుయ్ వెన్‌జింగ్, హాన్ కాంగ్ జోడీని నుంచి ఎదురైన పోటీని తట్టుకున్నారు. చైనా జోడీ 235.47 పాయింట్లతో రజత పతకాన్ని అందుకుంది. మిగన్ డమెల్, ఎరిక్ రాడ్‌ఫోర్డ్ జోడీ (కెనడా/ 230.15 పాయింట్లు)కి కాంస్య పతకం లభించింది.
పురుషుల డౌన్ హిల్: ఆల్‌పైన్ స్కీయింగ్ పురుషుల డౌన్ హిల్ విభాగంలో టైటిల్‌ను నార్వే స్కీయర్ అక్సెల్ లూడ్ స్విండల్ గెల్చుకున్నాడు. అతను ఒక గంట, 40.25 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరాడు. కాగా, స్విండర్ సహచరుడు జెటిల్ జాన్స్‌రెడ్ ఒక గంట, 40.37 నిమిషాలతో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించి, రజత పతకాన్ని స్వీకరించాడు. స్విట్జర్లాండ్‌కు చెందిన బీట్ ఫూయిజ్ ఒక గంట, 40.43 నిమిషాలతో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు.
పురుషుల బయథ్లాన్: పురుషుల బయథ్లాన్‌లో భాగంగా గురువారం జరిగిన ఇండివిజువల్ ఈవెంట్‌లో నార్వేకు చెందిన జొహానె్నస్ థియాంగ్‌నెస్ బొ స్వర్ణ పతకం సాధించాడు. జకోవ్ ఫాక్ (స్లొవేనియా), డామినిక్ లాండర్‌టింగర్ (ఆస్ట్రియా) వరుసగా రజత, కాంస్య పతకాలను అందుకున్నారు. కాగా, మహిళల ఇండివిజువల్ ఈవెంట్‌లో హన్నా ఒబెర్గ్ (స్వీడన్), అనస్తాసియా కుజ్మినా (స్లొవేనియా), లారా డహిమెర్ (జర్మనీ) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించారు.
లూగ్ టీం రిలే: అత్యంత క్లిష్టమైన లూగ్ టీం రిలేను జర్మనీ తన ఖాతాలో వేసుకుంది. నతాలిక్ గీస్నెబర్గర్, జొహానెస్ లాడ్‌విగ్, తొమియాస్ వెన్డీ, తొమియాస్ ఆరిట్ సభ్యులుగా ఉన్న జర్మనీ జట్టు తన ప్రత్యర్థులపై పూర్తి ఆధిత్యంతో, విజేతగా నిలిచింది. కెనడాకు రజతం, ఆస్ట్రియాకు కాంస్యం లభించాయి.
పురుషుల స్నోబోర్డ్: ఫ్రాన్స్‌కు చెందిన పియెర్ వాల్టర్ పురుషుల స్నోబోర్డ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. జారిడ్ హూస్ (ఆస్ట్రేలియా), రెగియో హెర్నాండెజ్ (స్పెయిన్) వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించారు.
స్పీడ్ స్కేటింగ్: స్పీడ్ స్కేటింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో కెనడాకు చెందిన టెడ్‌జాన్ బ్లూమెన్ స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. జారిట్ బెర్గ్‌స్మా (నెదర్లాండ్స్), నికొలా టమొలెరో (ఇటలీ) రజత, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. ఇలావుంటే, సంక్లిష్టంగా మారిన వాతావరణం కార ణంగా 16 మంది గాయపడ్డారు.

చిత్రం..గాంగ్‌యుంగ్‌లో గురువారం పెయిర్ ఫిగర్ స్కేటింగ్ జరుగుతున్నప్పుడు సంయుక్త కొరియా జెండాలను ఊపుతూ, తామంతా ఒక్కటేనన్న సందేశాన్నిస్తున్న ఉత్తర కొరియా ఛీర్ లీడర్లు