క్రీడాభూమి

వింటర్ ఒలింపిక్స్ షిఫ్రిన్ ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 15: వింటర్ ఒలింపిక్స్‌లో తన పతకాల వేటకు శ్రీకారం చుట్టాల్సిన మొదటి పోరు మళ్లీ వాయిదా పడుతుందేమోన్న భయంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా స్కీయర్ మిఖేల షిఫ్రిన్‌కు ఊరట లభించింది. సోమవారం జరగాల్సిన మహిళల జెయింట్ స్లాలమ్ పోటీలు గురువారాని వాయిదా పడిన విషయం తెలిసిందే. విపరీతమైన మంచు కురుస్తూ, బలమైన శీతల గాలులు వీస్తున్న నేపథ్యంలో, ఈ పోటీలు జరుగాతాయా లేక మరోసారి వాయిదా పడతాయా అన్న అనుమానం తలెత్తింది. అయితే, అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, మహిళల జెయింట్ స్లాలమ్‌ను నిర్వహించడం, హోరాహోరీగా సాగిన పోరులో 22 ఏళ్ల షిఫ్రిన్ స్వర్ణం సాధించడం జరిగిపోయాయి. 2 గంటల, 20.02 నిమిషాల్లో ఆమె లక్ష్యాన్ని చేరుకుంటే, నార్వేకు చెందిన రాగన్‌హిల్డ్ మోవిన్‌చెట్ 2 గంటల, 20.41 నిమిషాలతో రజత పతకాన్ని అందుకుంది. ఇటలీ స్కీయర్ ఫెడెరికా బ్రిగ్నన్ 2 గంటల, 20.48 నిమిషాల్లో రేస్‌ను పూర్తి చేసి, కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

చిత్రం..మహిళల జెయింట్ స్లాలమ్ రేస్ విజేత మిఖేల షిఫ్రిన్