క్రీడాభూమి

ముగ్గురూ ముగ్గురే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్: సుమారు 12 నెలలుగా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న బ్యాట్స్‌మెన్‌లో ముగ్గురు భారతీయులే కావడం విశేషం. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఒకరితో ఒకరు పోటీపడుతూ పరుగుల వరద పారిస్తున్నారు. భారత్‌కు తిరుగులేని విజయాలను అందిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన ఐదో వనే్డలో 73 పరుగుల తేడాతో విజయం సాధించడంతో, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 4-1 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సూపర్ సెంచరీ భారత్ విజయంలో ప్రధాన భూమిక పోషించింది. గత 12 నెలల్లో భారత్ వరుసగా తొమ్మిది ద్వైపాక్షిక వనే్డ సిరీస్‌లను కైవసం చేసుకోవడంలో ఈ ముగ్గురిదీ కీలక భూమిక. రికార్డులను బద్దలు చేస్తూ కోహ్లీ దూసుకెళుతుంటే, వనే్డల్లో డబుల్ సెంచరీలతో రోహిత్ రాణించాడు. 2017 జూన్ నుంచి ధావన్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. 2016 నుంచే కోహ్లీ అసాదారణ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సెంచరీలు చేయడం అతనికి అలవాటుగా మారింది. గత ఏడాది వనే్డ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డు సృష్టించాడు. ఏడాది కాలంలో 1,460 పరుగులు చేశాడు. ఆ స్కోరులో ఆరు సెంచరీలు ఉన్నాయి. మొత్తం మీద అతను కెరీర్‌లో 55 సెంచరీలు చేయగా, వాటిలో 34 వనే్డ ఫార్మాట్‌లోనివే. ఈ విభాగంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో సచిన్ తెండూల్కర్ (49 శతకాలు) తర్వాత అతను రెండో స్థానాన్ని ఆక్రమించాడు. నిజానికి గత ఏడాది జనవరిలో ఇంగ్లాండ్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌ను మినహాయిస్తే, మొదటి ఐదు నెలల్లో టీమిండియా 50 ఓవర్ల ఫార్మాట్‌లో మ్యాచ్‌లు ఆడలేదు. జూన్ మాసంలో ఇంగ్లాండ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడింది. అందులో ఫైనల్ చేరి, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. కాగా, ఏడాదిలో ఆడింది తక్కువ సమయమే అయినప్పటికీ, కోహ్లీ, రోహిత్ చెరి ఏడు సెంచరీలు చేశాడు. మంగళవారం దక్షిణాఫ్రికాపై చెలరేగిన అతను కెరీర్‌లో 17వ వనే్డ సెంచరీని నమోదు చేశాడు. దక్షిణాఫ్రికా గడ్డపై మొదటిసారి శతకం బాదిన అతను భారత్‌ను గెలిపించాడు. టెస్టు ఫార్మాట్‌లో విఫలమైనప్పటికీ, ఆ లోటును కీలక సెంచరీతో భర్తీ చేశాడు. దక్షిణాఫ్రికాతో మొదటి రెండు టెస్టుల్లో, నాలుగు ఇన్నింగ్స్ ఆడి, వరుసగా 11, 10, 10, 47 చొప్పున పరుగులు చేశాడు. ఈ వైఫల్యాల కారణంగా మూడో టెస్టులో ఆడే అవకాశాన్ని అతను కోల్పోయాడు. వనే్డ సిరీస్‌లోనూ అతను ఆరంభంలో తడబడ్డాడు. మొదటి నాలుగు వనే్డల్లో వరుసగా 20, 15, 0, 5 చొప్పున పరుగులు చేసి, తీవ్ర విమర్శలకు గురయ్యాడు. అయితే, సిరీస్ ఫలితాన్ని నిర్ణయించిన మ్యాచ్‌లో అతను 115 పరుగులు చేయడం ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.
కోహ్లీ, రోహిత్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ధావన్ కూడా పరుగులను రాబట్టడంలో సత్తా చాటుతున్నాడు. గత 12 నెలల కాలంలో అతను నాలుగు సెంచరీలు సాధించాడు. ఏడు అర్ధ శతకాలను నమోదు చేశాడు. కెరీర్‌లో తన 100వ వనే్డ ఇంటర్నేషనల్‌లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ క్రికెట్‌లో ఈ విధంగా తమతమ వందో వనే్డల్లో సెంచరీ కొట్టిన గార్డన్ గ్రీనిడ్జ్ (వెస్టిండీస్), క్రిస్ కెయిన్స్ (న్యూజిలాండ్), మహమ్మద్ యూసుఫ్ (పాకిస్తాన్), క్రిస్ గేల్ (వెస్టిండీస్), కుమార సంగక్కర (శ్రీలంక), మార్కస్ ట్రెస్క్థోక్ (ఇంగ్లాండ్), రాంనరేష్ శర్వాణ్ (వెస్టిండీస్), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) సరసన స్థానం సంపాదించాడు. గత 12 నెలల కాలంలో ఎక్కువ శతకాలు సాధించిన బ్యాట్స్‌మెన్‌లో కోహ్లీ, రోహిత్, ధావన్ ముందు వరుసలో ఉన్నారు. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్, ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ చెరి మూడు సెంచరీలు చేశారు. ఏ రకంగా చూసినా గడచిన 12 నెలల్లో ముగ్గు రు భారత మొనగాళ్లను మించిన బ్యాట్స్‌మన్ ప్రపంచ క్రికెట్‌లో కనిపించలేదు. వీరి దూకుడు కొనసాగుతుందనేది అభిమానుల నమ్మకం. దక్షిణాఫ్రికాపై చివరి వనే్డతోపాటు టీ-20 సిరీస్‌లోనూ వీరు రాణిస్తారన్న ధీమా వ్యక్తమవుతున్నది.

చిత్రాలు..*రోహిత్ శర్మ *శిఖర్ ధావన్