క్రీడాభూమి

వచ్చే సీజన్‌లో భారత్ బిజీ బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17:వచ్చే ప్రపంచకప్ లక్ష్యంగా భారత క్రికెట్ జట్టు భారీ కసరత్తే చేస్తోంది. 2018-19లో అన్ని ఫార్మాట్లలో ప్రతిభాపాటవాలకు పదునుపెట్టేలా బిజీ షెడ్యూల్‌ను రూపొందించుకుంటోంది. దాదాపు 30 అంతర్జాతీయ వనే్డలు, 12 టెస్ట్ మ్యాచ్‌లు, 21 టీ-20 మ్యాచ్‌లతో కలపి మొత్తం 63 అంతర్జాతీయ మ్యాచ్‌లలో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు ఏర్పాట్లు చేసుకుంటోంది. భారత జట్టు ఈ ఏడాది షెడ్యూల్ శ్రీలంకలో త్వరలో జరిగే నిదహస్ మూడుదేశాల టీ-20 టోర్నీతో ముగియనుంది. బంగ్లాదేశ్, శ్రీలంక, భారత్ ఈ టోర్నీలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
కాగా భారతజట్టు కొత్త సంవత్సరపుక్రికెట్ సీజన్ (2018-19) వచ్చే ఏప్రిల్‌లో ‘్ధనాధన్’ ఐపీఎల్‌తో ప్రారంభమవుతుంది. జూన్‌లో ఐర్లాండ్‌లో ఆ జట్టుతో జరిగే రెండు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టు అదే నెలలో బెంగళూరులో ఆఫ్ఘాన్ జట్టుతో ఏకైక చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. అనంతరం ఇంగ్లండ్‌లో సుదీర్ఘ పర్యటనకు శ్రీకారం చుడుతుంది. జులై-సెప్టెంబర్‌ల మధ్య రెండున్నర నెలల పాటు సాగే ఆ పర్యటనలో ఐదు టెస్ట్‌మ్యాచ్‌లు, 3 వనే్డలు, ఒక టీ-20 మ్యాచ్ ఆడుతుంది. 50 ఓవర్ల పరిమిత మ్యాచ్‌లతో ఆడే ఆసియాకప్‌ను దృష్టిలో పెట్టుకున్న భారతజట్టు తన షెడ్యూల్‌ను రూపొందించుకుంటోంది. కాగా ఆసియాకప్ వేదిక ఇంకా ఖరారు కాలేదు. ఆసియాకప్‌లో భాగంగా 9 వనే్డ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఆ తరువాత అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్‌లో పర్యటించే వెస్టిండీస్ జట్టుతో చిన్నపాటి షెడ్యూల్‌లో ఆడనుంది. వెస్టీండీస్‌తో రెండు టెస్టులు, ఐదు వనే్డలు, మూడు టీ-20 మ్యాచ్‌లలో భారత్ తలపడుతుంది. ఆ తరువాత, నవంబర్-డిసెంబర్‌లలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళుతుంది. ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు టీ-20 మ్యాచ్‌లలో తలపడుతుంది.
కాగా న్యూజీలాండ్‌లో టెస్ట్ మ్యాచ్‌లు ఆడకూడదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్‌లు వాణిజ్యపరంగా లాభదాయకం కాదని బీసీసీఐ భావిస్తోంది. వచ్చే జనవరి మధ్యలో ప్రారంభమయ్యే భారత జట్టు న్యూజిలాండ్ పర్యటన ఫిబ్రవరి రెండోవారంలో ముగుస్తుంది. ఐదు వనే్డలు, ఐదు టీ-20 మ్యాచ్‌లలో న్యూజీలాండ్‌తో భారత జట్టు తలపడుతుంది. ఫిబ్రవరి రెండోవారం చివర్లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా ఇరుజట్లు పరిమిత ఓవర్ల క్రికెట్ పోటీల్లో పాల్గొంటుంది. ఐదు అంతర్జాతీయ వనే్డ మ్యాచ్‌లు, రెండు టీ-20 మ్యాచ్‌లలో ఇరుదేశాలూ తలపడతాయి. వచ్చే ఏడు జింబాబ్వేతో జరిగే ఐదు వనే్డలు, రెండు టీ-20 మ్యాచ్‌లతో 2018-19లో భారత్ క్రికెట్ సీజన్ ముగుస్తుంది.