క్రీడాభూమి

కోహ్లీ ఆట తీరును చూసి ఎంతో నేర్చుకున్నా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, ఫిబ్రవరి 17: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరుపై దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మర్‌క్రమ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ ఆటతీరును నిశితంగా పరిశీలించే తాను ఈ స్థాయికి చేరుకున్నానని ఆయన వ్యాఖ్యానించాడు. భారత్‌తో జరిగిన ఆరు వనే్డల సిరీస్‌లో తమ జట్టు తరఫున చాలా పొరపాట్లు జరిగి 1-6 తేడాతో సిరీస్ కోల్పోయిన బాధ తమను అన్నిరకాలుగా వేధిస్తున్నా కెప్టెన్‌గా కోహ్లీ జట్టును నడిపించిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నాడు. ఆరు వనే్డలలో కోహ్లీ 558 పరుగులు చేయడం, అందులో మూడు సెంచరీలు నమోదయ్యాయంటే, ఒక కెప్టెన్‌గా తాను అతనని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు చక్కగా, విజయవంతంగా నిర్వర్తించి, అత్యుత్తమ ఘనత సాధించిన కోహ్లీని ఎంత పొగిడినా తక్కువేనని అన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తుమ, అద్భుత ఆటగాళ్లలో ఒకడైన విరాట్ కోహ్లీని ఆటతీరును తాను ఎప్పటినుంచో గమనిస్తూ వస్తున్నానని, కానీ ఇప్పటి ఘన విజయంతో కోహ్లీ నుండి ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆయన వ్యాఖ్యానించాడు. తమ రెండు జట్లలో కోహ్లీ అంతటి ఆటగాడు మరొకరు లేడని తాజా ఫలితంతో రుజువైందని, ఈ విషయంలో ఎలాంటి సంశయం, సందేహం అక్కర్లేదని అన్నాడు. మైదానంలో కోహ్లీ పరుగుల దాహం తీర్చుకోవడం తనకు తనే సాటని, అందుకే ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా వినుతికెక్కాడని అన్నాడు. కెప్టెన్‌గా తన విద్యుక్త
ధర్నాన్ని నూటికి నూరుపాళ్లు నిర్వర్తించడమే కాకుండా జట్టులోని స్పిన్నర్లు, పేసర్లను సక్రమంగా వినియోగించుకోవడం కోహ్లీకే అచ్చివచ్చిన అంశమని అన్నాడు. ఆరు వనే్డలలో తమ జట్టు ఏకోశానా ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వలేకపోయిందని, ఇది తమను నిరాశకు గురిచేసిందని, తమ జట్టు ఘోర ఓటమి వెనుక తలాపాపం తిలా పిడికెడు అన్న చందంగా ఎన్నో కారణాలు ఉన్నాయని మరక్రమ్ వ్యాఖ్యానించాడు. ఓటమి నేర్పిన పాఠాలను నెమరు వేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారునిగా రాణించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నాడు. భారత్‌తో ఆడిన ఆరు వనే్డలలో 127 పరుగులు మాత్రమే చేసిన తాను కెప్టెన్‌గా సరిగా ఆడలేకపోయాననే అసంతృప్తి ఉందని అన్నాడు. ఇలాంటి సిరీస్‌లు ఎన్నో ఆడాల్సి ఉంటుందని, అన్నింటిలోనూ ఎదురయ్యే ఒత్తిడిని ఆనందంతో అధిగమించి ఆటతీరును మరింత పెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తానని అన్నాడు.