క్రీడాభూమి

క్రీడల అభివృద్ధికి నూతన పాలసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం నూతన క్రీడా పాలసీని తీసుకువస్తోందని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి టి.పద్మారావు తెలిపారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్), ఒలింపిక్ సంఘం తెలంగాణ (ఓఎటీ)ల సంయుక్త ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా 2017-18లో జాతీయ స్థాయిలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగంలో పతకాలు సాధించిన దాదాపు 350 మంది క్రీడాకారులను ఘనంగా సత్కరించింది. లాల్‌బహదూర్ స్టేడియంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి జాతీయ స్థాయిలో క్రీడాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం క్రీడలకు తగిన ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రెండు శాతం రిజర్వేషన్, గ్రామీణ స్థాయిలో క్రీడలను అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో క్రీడా సదుపాయాలను మొరుగుపర్చేందుకు స్టేడియంల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు గాను నూతన క్రీడా పాలసీని రూపొందించామని, దీని అమోదం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశామన్నారు. శాట్స్‌లో గత కొనే్నళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కోచ్‌ల సర్వీసులను త్వరలో క్రమబద్ధీకరిస్తామని, ఈ విషయంలో సీఎంతో మాట్లాడి తగిన నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎల్‌బీ స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరిస్తామని, అందుకు కావాల్సిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాట్స్ చైర్మన్ అలీపురం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా 200 మంది కోచ్‌లను నియమించడానికి, ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ హాస్టళ్లు, క్రీడా అకాడమీలను నిర్మించడంతో పాటు రాష్ట్రంలోని 30 మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు ప్రతి నెల రూ.10వేలు స్ట్ఫైండ్‌ను ప్రభుత్వపరంగా అందించడానికి గత నెల జనవరిలో జరిగిన శాట్స్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి రానున్న బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించాలని సీఎంను కోరారు. కార్యక్రమంలో శాట్స్ వీసీ, ఎండీ ఎ.దినకర్‌బాబు, డిప్యూటీ డైరెక్టర్లు శోభా, వెంకట్ రమణ, ఓఎటీ అధ్యక్ష, కార్యదర్శులు కె.రంగారావు, ఎస్‌ఆర్.ప్రేమ్‌రాజ్, మమత సంతోష్ గుప్తాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన చైర్మన్‌లు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..జాతీయ స్థాయిలో నిర్వహించిన వివిధ క్రీడల్లో గెలుపొందిన విజేతలతో మంత్రి పద్మారావు,
శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు