క్రీడాభూమి

‘నేను ఎవరికీ పోటీ కాను’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, ఫిబ్రవరి 17: దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరు వనే్డల సిరీస్‌లో 5-1 తేడాతో ఘన విజయం సాధించి, ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా ఘనత సాధించిన భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాను ఎవరికీ పోటీ కానని అంటున్నాడు. కెప్టెన్‌గా ఎవరూ అందనంత ఎత్తుకు ఎదిగి తనకు తానే సాటి అని నిరూపించుకున్న కోహ్లీ తాను సాధించిన విజయాలపై ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ప్రశంసల జడివానలో తడుస్తున్నాడు. అవిరామ కృషి, పట్టుదల, సమష్టి నాయకత్వంతో జట్టులోని అందరినీ కలుపుకునిపోయే తత్వాన్ని అలవరచుకున్న కోహ్లీ తాను ఎవరికీ పోటీ కానని చెబుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 5-1 తేడాతో ఘన విజయం సాధించి, కరేబియన్ గడ్డపై ఇంతవరకు భారత్ సాధించని అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరు వనే్డలలో కోహ్లీ 558 పరుగులు సాధించడం గొప్ప విశేషమైతే, అందులో మూడు సెంచరీలు ఉండడం ఘనత సాధించడం మరో గొప్ప విశేషం.
విదేశీ గడ్డపై భారత్ సాధించిన అరుదైన ఘనత గురించి కోహ్లీ మాట్లాడుతూ ఈ ఘనత సాధించడం వెనుక తాను నమ్మిన సిద్ధాంతాలు, పనితీరు, మెలకువలు అన్నీ కలగలసి జట్టుకు విజయాన్ని అందించాయని అన్నాడు. మైదానంలో గెలిచేందుకు ఎలా ఆడాలో ముందుగానే తన మెదడులో చక్కని ఫ్రేమ్‌ను ఏర్పాటు చేసుకుని అందుకు తగిన విధంగా వ్యవహరిస్తానని అన్నాడు. వనే్డలలో అద్భుత తీరుతో ప్రపంచంలోనే ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా వినుతికెక్కిన కోహ్లీ కెప్టెన్‌గా తన విద్యుక్త ధర్మాన్ని సరిగా నిర్వహించానని సంతోషం వ్యక్తం చేశాడు. ‘నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను. చక్కని ఫలితం వచ్చింది.
ఉత్తమ జట్టుగా భారత్‌ను నిలబెట్టాను’ అని వ్యాఖ్యానించాడు. కోహ్లీ సాధించిన అద్భుత విజయాన్ని ప్రపంచవ్తాప్తంగా వేనోళ్ల ప్రశంసలు వస్తుండడంతో ఈ ఘనత తమ అందరి కృషి ఫలితమని సరిపెట్టుకుంటున్నాడు. ‘మా జట్టు మేనేజిమెంట్ కెప్టెన్‌గా నాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే నేను కూడా నా సహచరులపై ఆటతీరుపై మరింత నమ్మకం పెట్టుకున్నాను’ అని అన్నాడు. మంచి ఆటతీరు ప్రదర్శించి విజయం సాధించినపుడు పొగడ్తలు రావడం, ఆటతీరు పేలవంగా ఉన్నపుడు విమర్శలు రావడం సహజమేనని, అన్నింటినీ ధీటుగా తట్టుకుని నిలబడే తత్వం తనకు ఉందని, తన కర్తవ్యాన్ని సంపూర్తిగా నిర్వర్తించానని ఆయన వ్యాఖ్యానించాడు. ‘ఎప్పుడైనా నేను తప్పులు చేస్తే ముందుకు వచ్చి అంగీకరిస్తాను. ఈ విషయంలో ఎవరూ విమర్శించేందుకు ఆస్కారం ఇవ్వను’ అని అన్నాడు. తాను సాధించిన ఘన విజయంపై ఎంతోమంది ఎన్నోరకాలుగా ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారని, అందులో తన ఘనత ఏముందని, తన విద్యుక్త ధర్నాన్ని తాను నిర్వర్తించానని మాత్రమే తాను భావిస్తానని, ఇందులో ఎవరికీ అనుకూలంగా వ్యవహరించే ఆస్కారం లేదని అన్నాడు. గతంలో కొన్నిసార్లు తనపై వచ్చిన విమర్శలు తనను బాధించిన విషయాన్ని ఆయన అన్యాపదేశంగా ప్రస్తావించాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరు వండే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో భారత్ ప్రత్యర్థిపై నిర్నిరిధోకంగా ఘనవిజయం సాధించినపుడు అతలి జట్టు ఆటతీరుపై విమర్శలు వచ్చిన సందర్భంగా వచ్చిన వ్యాఖ్యలు సహజంగా ఆశ్చర్యానికి గురిచేస్తాయని కోహ్లీ అన్నాడు. నెల క్రితం వరకు తమ జట్టు ఆటతీరు పేలవంగా ఉండేదని, ఇపుడు తాము సాధించిన ఘన విజయంతో అందనంత ఎత్తుకు ఎదిగామని, తమ మైండ్‌సెట్ ఏమాత్రం మార్చుకోలేదని అన్నాడు. దక్షిణాఫ్రికా జట్టులో కొందరు క్రికెటర్లు గాయాలబారిన పడి పోటీలకు దూరంగా ఉండడాన్ని ప్రస్తావిస్తూ అదంతా మన చేతుల్లో లేదని, ఉన్నవాళ్లలోనే ఉత్తమ జట్టును ఎంపిక చేసుకుని బరిలోకి దిగడం తన కర్తవ్యమని కోహ్లీ పేర్కొన్నాడు.
ప్రపంచ కప్‌పై కోహ్లీ సేన గురి
దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 5-1 తేడాతో ఘన విజయం సాధించడంతోనే సరిపెట్టుకోకుండా వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్‌పై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ దృష్టి సారించనున్నాడు. ఇపుడు సాధించిన అఖండ ఘనతతో అన్నివిభాగాల్లో పరిణితి సాధించిన జట్టుగా పేరు సంపాదించుకున్న కోహ్లీ సేన ఆటతీరును మరింత మెరుగుపర్చుకోవడం ద్వారా ప్రపంచ కప్ సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ‘మైదానంలోకి దిగినపుడు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వంటి అన్ని విభాగాల్లో ఇప్పటికే ఎంతో పరిణితి సాధించాం.
అయితే, ఈ ఘనతతోనే సరిపెట్టుకోం. మరింత బలపడతాం. ఇందుకు అన్నివిధాల కృషి చేస్తాం’ అని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. ‘జట్టు అన్నిరంగాల్లో పరిణితి సాధించి, మరింత బలపడేందుకు అవకాశాలను వెతుకుతున్నాం..అంతా సమష్టిగా చర్చించి ఒక నిర్ణయానికి వస్తాం’ అని ఆయన అన్నాడు. జట్టులో జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లతోపాటు స్పిన్నర్ల ద్వయం యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ వంటి వారి ఆటతీరును కోహ్లీ ప్రస్తుతించాడు. మిడిలార్డర్‌ను మరింత పటిష్ట చేయాల్సిన అవసరం ఉందని, ఇప్పటికే మిడిలార్డర్‌గా దిగిన సహచర బ్యాట్స్‌మెన్‌లలో ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్, అజింక్య రహానేలను ఉద్దేశించి కోహ్లీ మాట్లాడుతూ ఈ విషయమై వారికి సూచించామని, అలాంటి వారికి మరోసారి అవకాశం ఇచ్చి చూస్తామని అన్నాడు. మిడిలార్డర్‌కు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తమ కోచ్ సహా, మేనేజిమెంట్ ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నాడు.
మర్‌క్రమ్‌ను చూడండి...ఎంతో ఓపికో...
సహచరులకు కోహ్లీ హితవు
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా అనేకమంది యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తారని, అలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ సహచరులకు సూచించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరు వనే్డ సిరీస్‌లలో భారత్ 5-1 తేడాతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో యువ క్రీడాకారులు తమకు అందివచ్చిన అపార అవకాలను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని అన్నాడు.
దక్షిణాఫ్రికా జట్టులోని యువ బ్యాట్స్‌మన్ ఎయిడెన్ మర్‌క్రమ్‌కు తొలి వనే్డ సందర్భంగా కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ గాయాలబారిన పడినపుడు కెప్టెన్సీ వచ్చినపుడు దానిని సద్వినియోగం చేసుకున్న తీరును భారత యువ క్రికెటర్లు పరికించాలని సూచించాడు. మర్‌క్రమ్‌కు వచ్చిన అవకాశాన్ని సరిగా వినియోగించుకోవడం వల్ల అతని భవిష్యత్తులో మంచి నాయుకుడి ఎదిగేందుకు అపార అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. మరక్రమ్ జూనియర్ లెవెల్‌లో ఆ దేశ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు సైతం నిర్వహించి, ఎంతో పేరు సంపాదించాడన్నాడు.
మర్‌క్రమ్ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకడిగా ఉన్నాడని, అతనికున్న ఓరిమి, సహనం తప్పకుండా అత్యుత్తమ స్థానంలో నిలబెడతాయనే నమ్మకం తనకు ఉందని అన్నాడు. క్రీడాకారుడు అన్నవాడికి ఓపిక, సహనం ఉంటే భవిష్యత్తులో నాయకుడిగా ఎదిగేందుకు అవి దోహదపడతాయని కోహ్లీ అన్నాడు. గతంలో అండర్-19 ప్రపంచ కప్ సాధించడంలో మర్‌క్రమ్ పాత్ర ఎంతో గొప్పదని ప్రస్తుతించాడు. తనకు కూడా మర్‌క్రమ్‌లాగే ఓర్పు, సహనం వంటి అత్యుత్తమ లక్షణాలు ఉండబట్టే ఇపుడు ఈ స్థితిలో ఉంటున్నానని, కష్టపడే తత్వం ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడో ఒకసారి మంచిరోజు వస్తుందని, దానికోసం ఎదురు చూడాలని అంటూ తనలాగే ప్రతి ఒక్కరి క్రికెటర్ ఎదగాలని తాను అభిలషిస్తున్నానని వ్యాఖ్యానించాడు.