క్రీడాభూమి

సిరీస్‌పై భారత్ మహిళా జట్టు కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహానె్నస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో మూడు వనే్డల సిరీస్‌ను గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు టీ-20 సిరీస్‌ను కూడా చేజిక్కించుకుని డబుల్ టైటిల్‌ను సాధించేందు దిశగా సన్నద్ధమవుతోంది. ఆత్మవిశ్వసంతో భారత మహిళల జట్టు రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ ఆదివారం జరుగనుంది. జోరు కొనసాగించి టీ-20లో కూడా ఆధిక్యంతో 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ గట్టి పట్టుదలతో ఉంది. గడిచిన రెండు మ్యాచ్‌ల్లో మిథాలీ రాజ్ అర్ధ సెంచరీలతో చెలరేగగా జెమీమా, వేదా కృష్ణమూర్తి బాగానే రాణిస్తున్నారు. వీరికి తోడు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, పాటిల్ రాణిస్తే సిరీస్‌ను భారత్ గెలిచి హ్యాట్రిక్ సాధించడం ఖాయమని క్రికెట్ విశే్లషకులు పేర్కొంటున్నారు. దక్షిణాఫ్రికాలో మూడు వనే్డల సిరీస్‌ను 2-1తో గెలిచిన ఊపును టీ-20లో కూడా పునరావృతం కావాలన్న గట్టి పట్టుదలతో భారత జట్టు ఉంది. సిరీస్‌లో భాగంగా భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించి 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత 3-0తో సిరీస్‌ను దక్కించుకునే దిశగా ఆదివారం జరుగనున్న మూడో మ్యాచ్‌లో ఎత్తుకు పైఎత్తులు వేయనుంది. భారత జట్టు ఆస్ట్రేలియాతో పాటు దక్షిణాఫ్రికాలో జరిగిన టీ-20 సిరీస్‌లో రాణించింది. టీ-20 సిరీస్‌లో జరిగిన రెండు మ్యాచ్‌లలో భారత్ వరుసగా, ఏడు, తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన విషయం విధితమే. ఈ రెండు మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో రాణించిన డ్యాషింగ్ బ్యాట్స్ మన్ వరుసగా 54, 76 పరుగులతో అజేయంగా నిలిచి అర్ధ సెంచరీలు సాధించింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ స్మృతి మంధాన రెండో మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి 42 బంతుల్లో 57 పరుగులు చేసి అర్ధ సెంచరీ చేసి వీక్షకులను అకట్టుకుంది. గాయాల కారణంగా మ్యాచ్ నుంచి తప్పుకున్న బౌలర్ జులన్ గోస్వామి లేన్నప్పటికీ, శిఖా పాండే బౌలింగ్‌లో రాణిస్తోంది. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్, ఆఫ్ బ్రేక్ బౌలర్ అనూజ పాటిల్, ఆల్ రౌండర్ దీప్తిశర్మ రాణిస్తే సిరీస్ భారత్ చేజిక్కించుకోవడం ఖాయం.

చిత్రాలు..భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ *దక్షిణాఫ్రికా కెప్టెన్ డేన్ వ్యాన్ నైకెర్క్