క్రీడాభూమి

అంతా భువీ మాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహనె్నస్‌బర్గ్, ఫిబ్రవరి 19: భారత్‌తో ఆదివారం జరిగిన తొలి టీ-20లో తమ ఓటమికి భారత ఫేస్ బౌలర్ భువనేశ్వర్ కుమారే కారణమని దక్షిణాఫ్రికా ఆటగాడు హెండ్రిక్స్ పేర్కొన్నాడు. లైన్ అండ్ లెంగ్త్ తప్పకుండా బంతులను విసురుతూ తమను క్రీజులో ఎక్కువ సేపు కుదురుకోనివ్వకుండా చేశాడని వాపోయాడు. భువీ బౌలింగ్‌లో సింగిల్స్ తీసుకోవడం తప్ప బౌండరీలకు ఆడే అవకాశమే లేకుండా పోయిందన్నాడు. ఓ ప్రణాళిక ప్రకారం భువీ బంతులు వేశాడని, అద్భుతంగా బౌలింగ్ చేశాడని హెండ్రిక్స్ కోనియాడాడు. తొలి పవర్ ప్లేలో భారత్ తమకంటే బాగా ఆడిందని మెచ్చుకున్నాడు. బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలించినా బౌలర్లు రాణించడంతో తమకు పరుగులు తీయడం కష్టంగా మారిందన్నాడు. ఓపెనర్లు జట్టు స్కోరు వేగాన్ని పెంచేందుకు శుభారంభాన్ని ఇవ్వాలనుకుంటారని, తాను కూడా అదే చేశానని, అయితే భాగస్వామ్యం నెలకొల్పడంలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లు విఫలమైనట్టు చెప్పాడు. భారత్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హెండ్రిక్స్ 70 పరుగులు చేసిన విషయం తెలిసిందే.