క్రీడాభూమి

నెట్స్‌లో ధోనీపై బౌలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 19: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై బౌలింగ్ చేసే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని కివీ ఎడమ చేతివాటం స్పిన్నర్ 26 ఏళ్ల మిచెల్ సంతన్‌నెర్ అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరఫున త్వరలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆడనున్న సంత్‌నెర్ నెట్ ప్రాక్టీస్‌లో ధోనీపై బౌలింగ్ వేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని, అది అసలైన మ్యాచ్‌కంటే ఆనందం కలిగిస్తుందని అభిప్రాయపడ్డాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మిచెల్ సంత్‌నెర్‌ను గత నెలలో జరిగిన వేలంలో 50 లక్షల రూపాయలకు తీసుకుంది. సీఎస్‌కే జట్టులో చోటు దక్కడం, ధోనీ, సురేష్ రైనా, రవీంద్ర జడేజా వంటి మేటి ఆటగాళ్లతో కలసి ఆడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని అన్నాడు. ఐపీఎల్‌లో ఆడేందుకు ఎంతో ఉత్సాహం కనబరుస్తున్నానని అన్నాడు.